About Us
ఈఎన్ఎస్(ఈరోజు న్యూస్ సర్వీస్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిజిస్ట్రేషన్, గుర్తింపు, ఇతర అనుమతులు,
కలిగిన తొలి తెలుగు డిజిటల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, విశాఖపట్నం, ప్రధాన కేంద్రంగా అమరావతి,
హైదరాబాదు మరియు అమెరికా, దుబాయ్ లలో నెట్వర్క్ కార్యాలయాలు కలిగిన ఏకైక వార్త సంస్థ. ఈఎన్ఎస్ చిన్న,
మధ్య తరగతి పత్రికలు, లోకల్ కేబుల్ టివి, ప్రైవేటు ఎఫ్ఎం ఛానళ్లు, యూట్యూబు ఛానళ్లకు వీడియో మరియు,
ఆడియో వార్తలు సరఫరా చేసే వార్తా సంస్థ.
ఈ సంస్థలో అంతర్భగమే www.enslive.net న్యూస్ వెబ్ సైట్ మరియు enslive social media news app.
ప్రస్తుతం కేవలం తెలుగు భాషలో మాత్రమే వార్తలను,ఫోటోలను వీడియోలను, యూట్యూబు ఛానల్ వార్తలు,
న్యూస్ పోల్ ఇలా అన్నింటినీ ఒకే యాప్ లో అందిస్తున్న ఏకైక సంస్థ ఈఎన్ఎస్
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ అంతర్జాతీయ వార్తలను కూడా ఇదే వేదికగా అందించే సంస్థ
కూడా. ఈఎన్ఎస్ పలు వార్తా సంస్థలతో కూడా కలిసి పనిచేస్తుంది… Ens Network ద్వారా సేకరించిన
సమాచారాన్ని కూడా ఆ సంస్థలతో పంచుకుంటుంది.
వార్తల కోసం ఈఎన్ఎస్ subscription తీసుకోవాలనుకునేవారు మరియు
మీ…మా.. న్యూస్ వెబ్ సైట్ www.enslive.net మరియు enslive app లో
ప్రకటనల కోసం సంప్రదించాలనుకునేవారు, మరింత సమాచారం కోసం ఈ
క్రింది మెయిల్ లోగానీ, ఫోన్ లోగాని సంప్రదించవచ్చు
ఈఎన్ఎస్(ఈరోజు న్యూస్ సర్వీస్) భారత దేశపు తొలి తెలుగు డిజిటల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ..
నిబంధనల ప్రకారం ప్రభుత్వ వార్తలకే తొలి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
అందించే సంక్షేమ పథకాల యొక్క వివరాలను పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేయాలనేది ఈఎన్ఎస్
న్యూస్ ఏజెన్సీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. వీటితోపాటు ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య సూత్రాలు, పర్యాటకం,
ఆధ్యాత్మికం, విద్య, వైద్యంతో పాటు పరిశోధనాత్మక కధనాలు పూర్తిస్థాయి ఆధారాలతో అందించడమే ప్రధాన
లక్ష్యంగా ఈఎన్ఎస్ లైవ్ యాప్ మరియు www.enslive.net, ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి.
- ఈఎన్ఎస్ లైవ్ కి ప్రచురణ కోసం వార్తలు పంపాలంటే మంచి నాణ్యత కలిగిలిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలు, అధికారుల పేరుతో కూడిన వివరాలను మాత్రమే పంపాల్సి వుంటుంది. నిరాధారమైన వార్తలు, సొంతంగా క్రియేట్ చేసిన వార్తలు, ఏకపక్షంగా ఉండే వార్తలు ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రచురణకు నిషేదం. వేరొక న్యూస్ యాప్ మరియు, ఇతర వెబ్ సైట్లలో నుంచి కాపీ చేసిన వార్తలు, ఇతర మీడియాలో ప్రచురితం అయిన వార్తలు స్వీకరణ నిషేదం. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా అనే అంశాలు వార్తలో ఖచ్చితంగా పొందుపరచాలి. అలా లేని వార్తలు తిరస్కరింపబడతాయి. యాప్ ఇనిస్టాల్ చేసిన దగ్గర నుంచి 500 వార్తలను పంపాల్సి వుంటుంది. దానికి రూ.1000 చెల్లిస్తాం, తరువాత ప్రతీ వార్తకు రూ.5, వీడియోకి కూడా రూ.5 నుంచి రూ.10 చెల్లిస్తాం. ప్రభుత్వ వార్తలకు కమిషన్ చెల్లించబడదు. డాష్ బోర్డులో 500, 1000 అయిన వెంటనే వితిడ్రా చేసుకునే వీలుంటుంది..ఆ మొత్తాన్ని ఫోన్ పే లేదా, గుగూల్ పే లేదా బ్యాంకు అకౌంట్ ద్వారా నగదు తక్షణమే పంపిస్తాం...
- ఈఎన్ఎస్ లైవ్ యాప్ కి వార్తలు పంపేవారు కనీసం డబుల్ కాలమ్ వార్త అంటే 1000 కేరక్టర్లుకి తక్కువ కాకుండా తప్పులు లేకుండా మంచి పదాలను వినియోగించి వార్త పంపాల్సి వుంటుంది. ప్రత్యేక స్టోరీలకు రెండు నుంచి మూడు ఫోటోలు పంపాల్సి వుంటుంది. వీడియోలు కూడా 10 నుంచి 15 ఎంబీకి మించి పంపకూడదు.. ముఖ్యమైన వార్తలు న్యూస్ బులిటిన్ లో కూడా వినియోగింస్తాం. అన్ని రాజకీయపార్టీలకు చెందిన వార్తలు ప్రచురణకు స్వీకరిస్తాం అదీ ముఖ్యమైన కార్యక్రమాలకు సబంధించినవి మాత్రమే.
- ఈఎన్ఎస్ లైవ్ కి వార్తలు పంపేవారు వాటికి పూర్తి బాధ్యత వారే వహించాలి. ఈఎన్ఎస్ లైవ్ యాప్ కి ఎటువంటి సంబంధం వుండదు. సదరు వ్యక్తులనే ఇబ్బందికర వార్తల విషయంలో బాధితులు సంప్రదించాల్సి వుంటుంది. ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా ప్రజా ఉపయోగ వార్తలు మాత్రమే మన యాప్ కి రిపోర్టర్లు పంపించాలి. అభివ్రుద్ధి వార్తలు, గ్రామాల్లో సమస్యల వార్తలకు అధిక ప్రాధాన్యత వుంటుంది.
- ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో వివాదాలకు తావుండదు, ప్రభుత్వ కార్యక్రమాల వార్తలకు మత్రమే తొలిప్రాధాన్యత. అధికారుల ఇంటర్యూలు, అభివ్రుద్ధి కార్యక్రమాలు, ఆరోగ్య పరమైన విషయాలకు,ప్రభుత్వ సంక్షేమ పథకాల వార్తలు, ప్రభుత్వ సేవలు, ఆలయాలు, గ్రామదేవతల పండుగల వార్తలు, పర్యావరణానికి సంబంధించిన వార్తలకు మాత్రమే ప్రాధాన్యత వుంటుంది. స్వయంగా తీసిన ఫోటోలు, వీడియోలు మాత్రమే పంపాల్సి వుంటుంది. లేదంటే కాపీరైట్ వస్తాయ్. అలాంటి వాటిని ప్రచురణకు స్వీకరించడం జరగదు.
- ఈఎన్ఎస్ లైవ్ యాప్ కు, www.enslive.net కు, ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీకి, ఈఎన్ఎస్ లైవ్ యూట్యూబు ఛానల్ కు ఏ రాజకీయ పార్టీలతో గానీ, నాయకులతో గానీ, సంస్థలతోగానీ ఎలాంటి సంబంధం లేదు.. ఎపుడైనా తప్పిదారి ప్రచురిస్తే మాత్రం ఈఎన్ఎస్ ఖండన కూడా గతంలో ఆరోపణ ప్రచురితమైనంత సైజులోనే ఖండన వార్త కూడా ప్రచురిస్తాం. ఆవిధంగా వార్తలు రాసేవారు కూడా రాసి పంపాల్సి వుంటుంది...
- ఈఎన్ఎస్ నెట్వర్క్ లో పనిచేయాలనుకునే విలేకరులకు కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి, జర్నలిజంలో పీజి చేసిన వారికి ప్రాధాన్యత వుంటుంది. పనిచేసే జర్నలిస్టుపై ఎలాంటి పోలీసు కేసులు ఉండరాదు, అంతేకాకుండా ఈఎన్ఎస్ లైవ్ పనిచేయడానికి వచ్చేవారు అవినీతి అక్రమాలకు పాల్పడమని బాండు రాసి ఇవ్వాలి. ఎపుడైనా ఏదైనా కేసులో ఇరుక్కుంటే ఆ క్షణమే ఈఎన్ఎస్ విలేకరి గుర్తింపు రద్దవుతుంది. దానికి సమ్మతించిన వారిని మాత్రమే సంస్థలోకి అనుమతిస్తాం.
- లీగల్ కేసులు, కాపీరైట్ కేసులు అన్నీ హైదరాబాదు హైకోర్టు, విశాఖపట్నం జిల్లా కోర్టు నందు మాత్రమే పరిష్కారానికి వెళతాం. అంతే కాదు కోర్టు పరమైన అంశాలు గానీ, వార్తలు గానీ ఈఎన్ఎస్ లైవ్ లో ప్రచురణకు నిషేదం.
- ఈఎన్ఎస్ వార్త సంస్థ నిబంధనలకు మేరకు మాత్రమే జీతబత్యాలు, కమిషన్లు ఉంటాయి. పై నియమ నిబంధనలు అంగీకరించిన వారిని, అన్ని రకాల స్కిల్ టెస్టులు పెట్టి ఉద్యోగాల్లోకి స్వీకరిస్తాం. విధుల్లో చేరిన తరువాత ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, కోర్టు లావాదేవీలకు తావుండదు. అట్టి వ్యవహారాలు అంగీకరించబడవు. అలా అంగీకారం ముందుగానే సమరర్పించాల్సి వుంటుంది. ఉద్యోగులను ఎప్పైడైనా, ఏకరాణంతోనైనా తొలగించే హక్కు, అధికారం, వార్తలను అంగీరించడం, తిరస్కరించడం అన్ని నిర్ణయాధికారాలు న్యూస్ డెస్క్, ఎడిటోరియల్ టీమ్ కే ఉంటాయ్.
- గ్రామ, వార్డు సచివాలయాల్లో అందే సేవలపై వచ్చే వార్తలకు అధిక ప్రాధాన్యత. ఈఎన్ఎస్ యాప్ ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తులకు, స్వచ్చంద సంస్థలకు, రాజకీయపార్టీలకు ప్రత్యేక న్యూస్ కవరేజి వుంటుంది. గ్రామస్థాయిలో సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాం. సమస్యను పరిష్కరించిన అధికారి కోసం కూడా ప్రత్యేకంగా న్యూస్ కార్డ్ వేస్తాం...
- మీ అమూల్యమైన సూచనలను, సలహాలను న్యూస్ కార్డ్ కింద వచ్చే కామెంట్ బాక్స్ లో రావచ్చు. షేర్ చేసుకోవచ్చు. ప్రతీ నెలా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ని ప్రమోట్ చేసి ఎవరైతే 25వేల మందితో ఇనిస్టాల్స్ చేయిస్తే వారికి రూ.14వేలు, 2వ బహుమతి కింద 15 వేల మందితో ఇనిస్టాల్ చేయిస్తే రూ.10వేలు, 3వ బహుమతి రూ.5వేలు 9వేల మందితో ఇనిస్టాల్ చేయిస్తే లక్కీ డిప్ ద్వారా అందజేయబడతాయ్. ముందుగా చేయించిన వారికి ప్రత్యేక నగదు బహుమతి రూ.5వేలు ఇవ్వబడతాయి. విజేతల వివరాలను వార్తల రూపంలో ఈఎన్ఎస్ లైవ్ లో న్యూస్ కార్డ్ వేస్తాం (షరతులు, నియమ నిబంధనలు వర్తిస్తాయ్).
- ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో యాడ్స్ సేకరించడానికి ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఆకర్షణమైన జీతం, ప్రత్యేక కమిషన్లు, టార్గెట్ లు కూడా ఉంటాయి. సకాలంలో టార్గెట్ పూర్తి చేసిన వారికి ప్రత్యేక ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి.
- 1000 వార్తల వరకూ రిపోర్టర్, 2000 వార్తలు దాటితే సీనియర్ రిపోర్టర్, 5000 వార్తలు దాటితే డిస్ట్రిక్ట్ రిపోర్టర్, 10000 వార్తలు దాటితే స్టేట్ రిపోర్టర్, హోదా ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో కల్పిస్తాం. ప్రతీ జిల్లాలో ఇద్దరికి 2021 మార్చి తరువాత ఈఎన్ఎస్ నుంచి డిస్ట్రిక్ట్ రిపోర్టర్, కెమెరా మేన్ లకు అక్రిడేషన్లు కూడా అందిస్తాం. వాటికోసం ప్రత్యేక యాడ్, ఈఎన్ఎస్ లైవ్ యాప్ News Card Subscription టార్గెట్ లు పూర్తి చేయాల్సివుంటుంది.
- ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, www.enslive.net ఈఎన్ఎస్ లైవ్ యాప్ కోసం పనిచేసే జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తాం. అదనంగా ప్రత్యేక ప్యాకేజీ ఇన్సెంటివ్స్ కూడా ఖచ్చితంగా అందజేస్తాం అదీ ముందుగా తెలియజేసిన నిబంధనలమేరకు...పీటూసీ ఇంటర్యూలు చేసే అవకాశం కూడా కల్పిస్తాం. మంచి జర్నలిస్టుగా తయారయ్యేందుకు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తాం. దానికోసం సదరు వ్యక్తి పనిచేసే చోట ప్రభుత్వ కార్యాలయాలు( గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రభుత్వ అధికారులు, పాఠశాలలు, కళాశాలలు, అక్కడ పనిచేసే ప్రధాన ఉపాధ్యాయులు వారి సెల్ నెంబర్లు, ఆ గ్రామంలోని పీహెచ్సీ ఫోటో, వైద్యాధికారితో పాటు ఆసుపత్రిలోని అందరు పారామెడికల్ సిబ్బంది ఫోటోలు వారి మొబైల్ నెంబర్లు, రైతు బరోసా కేంద్రాల ఫోటోలు, అక్కడ పనిచేసే వ్యవసాయశాఖ అధికారి ఫోన్ నెంబర్లు, గ్రామసచివాలయంలో అన్ని శాఖల అధికారులు వారి ఫోటోలు, సెల్ నెంబర్లు, గ్రామంలోని మంచి పథకాల ఫోటోలు, వివిధ రాజకీయపార్టీలకు చెందిన ప్రతినిధుల ఫోటోలు, ఫోటోలు, వీడియోలు, అన్ని పార్టీల నాయకుల ఫోటోలు, ఆ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలుంటే వాటి ఫోటోలు, వీడియోలు, గ్రామ దేవతల ఫోటోలు, వీడియోలు తాజాగా తీసి పంపాల్సి వుంటుంది. మండలంలో ఏ రిపోర్టర్ అయితే అత్యధిక గ్రామ దేవతల చరిత్రతో కూడిన వార్తలు రాస్తారో వారికి ప్రత్యేక నగదు బహుమతి కూడా అందిస్తాం.
- విధాన పరమైన నిర్ణయాలు, విలేకరుల నియామకాలు మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతాయి. ఆ స్థాయిలో పనిచేయడానికి మూడు నెలలు ముందుగా ఉచితంగా ఈఎన్ఎస్ లైవ్ లో ప్రతీరోజూ 15 వార్తలకు తగ్గకుండా పంపాల్సి వుంటుంది. పనితనం ఆధారం గా జీతాలు, కమిషన్లు ఉంటాయి. వాటిని అంగీకరించిన వారిని మాత్రమే విలేకరులుగానూ, ఫీల్డు, ప్రకటనలు సేకరించే సిబ్బందిగా ఈఎన్ఎస్ లైవ్ స్వీకరిస్తుంది.