Terms & Conditions of Ens live app and www.enslive.net also ens news agency Goal of Ens live ఈఎన్ఎస్(ఈరోజు న్యూస్ సర్వీస్)
తొలి తెలుగు డిజిటల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ...నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ వార్తలకే తొలి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కేంద్ర, రాష్
ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల యొక్క వివరాలను పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేయాలనేది ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ యొక్క
ప్రధాన ఉద్దేశ్యం. వీటితో పాటు ప్రజలకు ఉపయోగ పడే ఆరోగ్య సూత్రాలు, పర్యాటకం, ఆధ్యాత్మికం, విద్య, వైద్యం తో పాటు పరిశోధనాత్మక
కధనాలు పూర్తిస్థాయి ఆధారాలతో అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈఎన్ఎస్ లైవ్ యాప్ మరియు www.enslive.net, ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి.
Terms & Conditions of Ens live m-3
-
ఈఎన్ఎస్ లైవ్ కి ప్రచురణ కోసం వార్తలు పంపాలంటే మంచి నాణ్యత కలిగిలిన ఫోటోలు, వీడియోలు,
ఆధారాలు అధికారుల పేరుతో కూడిన వార్తలను ముందుగా ఈఎన్ఎస్ కి మాత్రమే పంపాల్సి వుంటుంది.
నిరాధారమైన వార్తలు, సొంతంగా క్రియేట్ చేసిన వార్తలు, ఏకపక్షంగా ఉండే వార్తలు ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో
ప్రచురణకు నిషేదం. వేరొక న్యూస్ యాప్ మరియు, వెబ్ సైట్లలో నుంచి కాపీ చేసిన వార్తలు, ఇతర మీడియాలో
ప్రచురితం అయిన వార్తలు స్వీకరణ నిషేదం.
-
ఈఎన్ఎస్ లైవ్ కి వార్తలు పంపేవారు వాటికి పూర్తి బాధ్యత వారే వహించాల్సి వుంటుంది.
వార్త ప్రచురితం అయిన తరువాత ఏదైనా ఇబ్బందులు(ప్రభుత్వ, ప్రైవేటు) వస్తే దానికి వార్తలు
పంపిన వ్యక్తి మాత్రమే బాధ్యత వహించాల్సి వుంటుంది. ఈఎన్ఎస్ లైవ్ యాప్ కి ఎటువంటి సంబంధ
ం వుండదు. సదరు వ్యక్తులనే ఇబ్బంది కర వార్తల విషయంలో సంప్రదించాల్సి వుంటుంది.
-
ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో వివాదాలకు తావు ఉండదు, ప్రభుత్వ కార్యక్రమాల వార్తలకు
మాత్రమే పెద్దపీట వేయడం జరుగుతుంది. అధికారుల ఇంటర్యూలు, అభివ్రుద్ధి కార్యక్రమాలు,
ఆరోగ్య పరమైన విషయాలకు,ప్రభుత్వ సంక్షేమ పథకాల వార్తలు, ప్రభుత్వ సేవలు, ఆలయాలు,
గ్రామదేవతల పండుగల వార్తలు, పర్యావరణానికి సంబంధించిన వార్తలకు మాత్రమే ప్రాధాన్యత వుంటుంది.
-
ఈఎన్ఎస్ లైవ్ యాప్ కు, www.enslive.net కు,
ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీకి, ఈఎన్ఎస్ లైవ్ యూట్యూబు ఛానల్ కు ఏ రాజకీయ పార్టీలతో గానీ,
నాయకులతో గానీ, సంస్థలతోగానీ ఎలాంటి సంబంధం లేదు, పెట్టుకోదు. ఒకే వర్గానికి, వ్యక్తులక
ు సంబంధించిన నిరాధార ఆరోపణల వార్తలు ఈఎన్ఎస్ లైవ్ లో నిషేదం, ఎపుడైనా తప్పిదారి
ప్రచురిస్తే మాత్రం ఈఎన్ఎస్ ఖండన కూడా గతంలో ఆరోపణ ప్రచురితమైనంత సైజులోనే ఖండన వార్త కూడా
ప్రచురిస్తాం. ఆవిధంగా వార్తలు రాసేవారు కూడా రాసి పంపాల్సి వుంటుంది...
-
ఈఎన్ఎస్ నెట్వర్క్ లో పనిచేయాలనుకునే విలేకరులకు కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి,
జర్నలిజంలో పీజి చేసిన వారికి ప్రాధాన్యత వుంటుంది. అదే సమయంలో జర్నలిస్టుపై ఎలాంటి పోలీసు
కేసులు ఉండరాదు, అంతేకాకుండా ఈఎన్ఎస్ లైవ్ పనిచేయడానికి వచ్చేవారు అవినీతి
అక్రమాలకు పాల్పడమని బాండు రాసి ఇవ్వాలి. ఎపుడైనా ఏదైనా కేసులో ఇరుక్కుంటే ఆ క్షణమే
ఈఎన్ఎస్ విలేకరి గుర్తింపు రద్దు అవుతుంది. దానికి సమ్మతించిన వారిని మాత్రమే సంస్థలోకి అనుమతిస్తాం,
స్వీకరిస్తాం.
-
లీగల్ కేసులు, కాపీరైట్ కేసులు అన్నీ హైదరాబాదు హైకోర్టు నందు మాత్రమే పరిష్కారానికి వెళతాం.
అదే సమయంలో కోర్టు పరమైన అంశాలు గానీ, వార్తలు గానీ ఈఎన్ఎస్ లైవ్ లో నిషేదం. కోర్టు దిక్కార వార్తలు
గానీ, కోర్టు పరిధిలో ఉన్న వార్తలు గానీ ఈఎన్ఎస్ లైవ్ లో ప్రచురణకు నిషేధం. సంస్థ అభివ్రుద్ధికి కారణమైన వారికి
ప్రత్యేక న్యూస్ కవరేజి ఈఎన్ఎస్ కల్పిస్తుంది.
-
ఈఎన్ఎస్ వార్త సంస్థ నియమ నిబంధనలకు మేరకు మాత్రమే పనిచేసేవారికి జీతబత్యాలు,
కమిషన్లు ఉంటాయి. పై నియమ నిబంధనలు అంగీకరించిన వారిని మాత్రమే అన్ని రకాల స్కిల్
టెస్టులు పెట్టి మాత్రమే ఉద్యోగాల్లోకి స్వీకరిస్తాం. విధుల్లో చేరిన తరువాత ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు,
కోర్టు లావాదేవీలకు తావుండదు. అట్టి వ్యవహారాలు అంగీకరించబడవు. అలా అంగీకారం ముందుగానే
సమరర్పించాల్సి వుంటుంది. ఉద్యోగులను ఎప్పైడైనా, ఏ కరాణంతోనైనా తొలగించే హక్కు, అధికారం,
వార్తలను అంగీరించడం, తిరస్కరించడం అన్ని నిర్ణయాధికారాలు ఈఎన్ఎస్ ప్రధాన కార్యాలయ నెట్వర్క్
బ్రుందానికే కలిగి వుంటాయి.
-
గ్రామసచివాలయాలు, వార్డు సచివాలయాల్లో అందే సేవలపై వచ్చే వార్తలకు అధిక
ప్రాధాన్యత, ప్రభుత్వ శాఖల వారీగా వచ్చే వార్తలకు పెద్దపీట వేస్తాం. ఈఎన్ఎస్
యాప్ ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తులకు, స్వచ్చంద సంస్థలకు, రాజకీయపార్టీలకు
ప్రత్యేక న్యూస్ కవరేజి వుంటుంది. గ్రామస్థాయిలో సమస్యలకు తొలి ప్రాధాన్యత ఇస్తాం. సమస్యన
ు పరిష్కరించిన అధికారి కోసం కూడా ప్రత్యేకంగా న్యూస్ ఎడిషన్ వేస్తాం...
-
విధాన పరమైన నిర్ణయాలు, విలేకరుల నియామకాలు మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ,
అంతర్జాతీయ స్థాయిలో జరుగుతాయి. ఆ స్థాయిలో పనిచేయడానికి మూడు నెలలు ముందుగా
ఉచితంగా ఈఎన్ఎస్ లైవ్ లో ప్రతీరోజూ పది వార్తలకు తగ్గకుండా పంపాల్సి వుంటుంది, పనిచేయాల్సి
వుంటుంది. పనితనం ఆధారం గా జీతాలు, కమిషన్లు ఉంటాయి. వాటిని అంగీక రించిన వారిని మాత్రమే
విలేకరులుగానూ, ఫీల్డు, ప్రకటనలు సేకరించే సిబ్బందిగా ఈఎన్ఎస్ లైవ్ స్వీకరిస్తుంది. జీతాలు లేదా కమిషన్లు
బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లించబడతాయి.
-
మీ అమూల్యమైన సూచనలను, సలహాలను వార్తలు కింద వచ్చే కామెంట్ బాక్స్ లో రావచ్చు.
మీ యొక్క సోషల్ మీడియా పేజీలకు ఈఎన్ఎస్ లైవ్ వార్తలను నేరుగా షేర్ చేసుకోవచ్చు.
ప్రతీ నెలా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ని ప్రమోట్ చేసి ఎవరైతే 5వేల మందితో ఇనిస్టాల్స్ ని చేయిస్తారో
వారికి రూ.14వేలు బహుమతి, రెండవ బహుమతి రూ.10వేలు, మూడవ బహుమతి రూ.5వేలు లక్కీ
డిప్ ద్వారా అందజేయబడతాయ్. ముందుగా చేయించిన వారికి ప్రత్యేక నగదు బహుమతి రూ.3వేలు
ఇవ్వబడతాయి. విజేతలకు వివరాలను వార్తల రూపంలో ఈఎన్ఎస్ లైవ్ లో వార్తల రూపంలో చూపబడతాయి.
(షరతులు, నియమ నిబంధనలు వర్తిస్తాయ్).