అనకాపల్లి జిల్లా స్పందనకు 159 అర్జీలు
Ens Balu
17
Anakapalle
2023-02-20 11:59:24
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరష్కరించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ని ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన 159 ఫిర్యాదులను పరిష్కారం నిమిత్తం ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు బదిలీచేశారు. కలెక్టర్ కార్యాలయంతోపాటు, సచివాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను కూడా నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. దరఖాస్తులు సచివాలయ పరిధి దాటితో మండల కేంద్రాలకు, అక్కడ కూడా పరిధి దాటితే జిల్లా కేంద్రానికి నివేదించాలన్నారు. జిల్లా కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి జిల్లా రెవెన్యూ అధికారికి వెంకటరమణ అర్జీలను స్వీకరించారు. డిఆర్ఓ దివ్యాంగుల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరించారు.