సింహాద్రి అప్పన్న సేవలో దేవాదాయ శాఖ కమిషనర్


Ens Balu
16
Visakhapatnam
2023-04-19 11:45:33

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ హోదాలో ఎస్.సత్యనారాయణ తొలిసారిగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు పూర్ణ కుంభంతె స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.  ముందుగా కమిషనర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని బేడా ప్రదక్షిణం చేశారు. స్వామి, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరము వేద పండితులు వేద ఆశీర్వచనము చేసి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించారు. ఆలయ ఈఓ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం 23న జరగబోయే చందనోత్స ఏర్పాట్లను క్షుణంగా పరిశీలించారు. సామాన్య భక్తునికి దర్శనం త్వరితగతిన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈఓ,  ఇంజనీరింగ్ సిబ్బందికి సూచిం చారు. వీరితో డిప్యూటీ కమిషనర్ సుజాత స్టేట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ రామరాజు ఆలయ సహాయ కార్యాలయం అధికారి వై శ్రీని వాసరావు పర్యవేక్షకులు తదితరులు కమిషనర్ వెంట ఉన్నారు.