కార్పోరేటర్ల కూర్పులో అసమ్మతి కుంపటి..?! క్యాంపు రాజకీయాలకు ఉప్పందించేది ఎవరు..


Ens Balu
133
visakhapatnam
2025-04-08 00:00:03

మహావిశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి చేస్తున్న ప్రయత్నాలకు అసమ్మతి కుంపటి పొగపెడుతున్నట్టు కనిపిస్తున్నది.. విశాఖలో ఎంపీ, ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర వహించిన సీనియర్ నేతలు జంపింగ్ లకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూటమిలో నేతలు వేరుకుంపటి పెట్టినట్టు తెలుస్తున్నది. దాని ప్రభావం రేపు అవిశ్వాసంలో కార్పోరేటర్ల కూర్పుపై ప్రభావం చూపిస్తుందా అనే విషయమై మహావిశాఖ నగరపరిధిలో హాట్ హాట్ చర్చ నడుతుస్తున్నది. దానికి ముక్తాయింపుగా ఓ సీనియర్ టిడిపి నేత ఇంటిలో కొందరు అసమ్మతి నేతలు పెట్టుకున్న సమావేశంలో మనకి గౌరవం దక్కని పార్టీలో మనమెందుకు యాక్టివ్ ఉండి కార్పోరేటర్లను కాపాడాలి..? అనే ప్రశ్న లేవనత్తారని.. ఆ కారణంగానే వైఎస్సార్సీపీకి ముందస్తు ఉప్పు అందడంతోనే కార్పోరేటర్ల క్యాంపు రాజకీయం మొదలైందనే విషయం ఇపుడు విశాఖలో గుప్పుమంటున్నది..అయితే అదేమీ లేదన్నట్టుగా నగరంలోని నేతలు చెబుతున్నప్పటికీ, అనుచరులు ప్రచారం చేస్తున్నప్పటికీ అసమ్మతినేతలు మాత్రం వారి పని వారు చేసుకు పోవడం వలనే కార్పోరేటర్ల కూర్పు కష్టమవుతుందని వాదన తెరపైకి రావడం చర్చనీయాంశం అవుతున్నది..?

మహావిశాఖనగరపాలక సంస్థ  మేయర్ పీఠాన్ని అవిశ్వాసంతో చేజిక్కించుకోవాలని చూస్తున్న కూటమికి సొంత వారే వెన్నుపోటు పొడుస్తున్నట్టు పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ప్రభుత్వం ఇటవలన ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో పదవులు రాకపోవడం, మరికొందరికి కీలక పదవులు వస్తాయనుకున్నా రాకపోవడంతో వారే పీఠాన్ని కదిపే విషయంలో కాస్త ఇబ్బంది పెడుతున్నారని పార్టీలో అంతర్లీన విషయం బయటకు పొక్కుతున్నది. ఈ కారణంగానే కార్పోరేటర్ల కూర్పు, వైఎస్సార్సీపీ నుంచి వస్తున్న కార్పోరేటర్ల మద్దతుని విచ్చిన్నం చేయడానికి అసమ్మతి వాదులు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు పెద్ద ఎత్తున  ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టిడిపి, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు వారి వారి క్యాడర్ లతో నియోజకవర్గాల వారగీ సమీక్షా సమావేశాలు పెట్టిన సందర్భంలో కొందరు నాయకులు తమకేమి విలువ లేదని మదన పడ్డారట. అదే సమయంలో వైఎస్సార్సీపీ నుంచి టిడిపి లోకి వచ్చిన కొందరు నాయకులకు కూడా కూటమిలో సరైన స్థానం లేకపోవడం కూడా జీవిఎంసీ కార్పోరేటర్ల కూర్పు, బల నిరూపణ విషయంలో ప్రతిబంధకం అవుతున్నట్టు సమాచారం అందుతుంది. 

ఏకంగా కొందరు అసమత్తి వాదులు ఉన్నవారైనా అక్కడే ఉండిపోండి  తద్వారా మీకు పార్టీలో గౌరవం పెరుగుతుంది.. పిలిచారని వచ్చేస్తే మాకున్నపాటి విలువ కూడా మీకుండదు అనే కోణంలో వచ్చే కార్పోరేటర్లను కూడా వ్యతిరేక వర్గం వారితో ఉప్పందించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఈ విషయం కాస్త కూటమి అధిష్టానికి చేరడంతో రంగంలోని ఎంపీ, ఎమ్మెల్యేలను దించినా పరిస్థితి పూర్తిగా అనుకున్నట్టు మారలేదని కూడా తెలుస్తున్నది. అయితే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అవిశ్వాసం పెట్టే సందర్భంలో వార్డుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని అయినా మిగిలిన బలం కార్పోరేటర్లు కూటమి లోకి వస్తారని అంతా భావించారు. అయితే వైఎస్సార్సీపీ తెలివిగా క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో అది కాస్త బెడిసి కొట్టింది. తమకు కార్పోరేటర్ల బలం ఉందని ప్రకటించి బలనిరూపణకు వెళ్లినా మ్యాజిక్ ఫిగర్ విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అనే అనుమానాలను కూటమి పెద్దలు వ్యక్తం చేస్తున్నారట. 

దానికి గల కారణాలను గ్రౌండ్ లెవల్ లో తెలుసుకుంటే ఎన్నికలవ వరకూ ఒకలా.. గెలిచిన తరువాత ఒకలా నేతలు వ్యవహరిస్తున్నారని.. అలాంటపుడు తామెందుకు పార్టీకోసం కష్టపడి పనిచేయాలనే వాదనను అసమ్మతి వాదులు తెరపైకి తీసుకు వచ్చారని.. వారిని బుజ్జగించడానికి మళ్లీ కూటమిలోనూ దువ్వే రాజకీయాలు చేస్తున్నారని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇదే విషయం ఇద్దరు ముగ్గు టిడిపి నేతలు కూడా గత మూడు రోజుల నుంచి కొందరు కూటమి నేతల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం అందుతున్నది. దీనితో కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నర కాలానికి ఆశపడి విశాఖ మేయర్ పీఠాన్ని కదపాలని చూస్తున్న తరుణంలో అసమ్మతివాదులు గాలితీసేస్తున్నారని మాత్రం క్యాడర్ లోకి వెళ్లిపోయింది. అయినా దానిని తిప్పికొట్టడానికి, అలాంటి వారిని మచ్చిక చేయడానికి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు కూడా హామీలు ఇస్తున్నారని తెలిసింది. దీనితో కార్పోరేటర్లకు సహకరించే నేతలు, వెన్నంటి ఉండి పెట్టుబడులు పెట్టే నేతలు వారు చెప్పినట్టుగా కార్పోరేటర్లను చెప్పుచేతల్లో ఉంచుకొని ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని కూడా కూటమి నేతలు అక్కడక్కడా చెబుతున్నారట. చూడాలి అవిశ్వాసంలో బలపరీక్ష సమయంలో ఎవరు ఎవరి బలం ఏ విధంగా ప్రదర్శిస్తారనేది..?!!

సిఫార్సు