ఈవిఎంలకు భద్రత మరింత కట్టుదిట్టం..కలెక్టర్ వినయ్ చంద్
Ens Balu
4
Arilova
2020-07-08 16:07:49
విశాఖలో ఇవిఎం, వివి ప్యాడ్ ల గొ డౌన్ ను జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ సందర్శించారు. బుధవారం చినగదిలి లోని ఇవిఎం, వివి ప్యాడ్లను ఉంచిన గొడౌన్ ను ప్రజా ప్రతినిధుల సమక్షములో బుధవారం సందర్శించారు. గొ డౌన్ లో ఉన్న ఎన్నికల సామగ్రిని నియోజక వర్గాల వారీగా ఉంచిన యంత్రాలను ఆయన పరిశీలించారు. విశాఖ రూరల్ తహసిల్థార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని సిప్టుల్లో ఉంటారని సెంట్రీలో ఉన్న గార్డులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిశోర్, విశాఖ రూరల్ తహసిల్థార్ నరసింహమూర్తి, వై.యస్.ఆర్. పార్టీ, టి.డి.పి., బి.జె.పి., తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.