ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం..
Ens Balu
2
ఉడా చిల్డ్రన్ థియేటర్
2020-10-29 18:16:50
ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఉడా చిల్డ్రన్ ఏరినాలో “ జగనన్న వైయస్సార్ బడుగు వికాసం” ప్రత్యేక పారిశ్రామిక పాలసీ 20 20 - 23 జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని వారికి ఆర్థికంగా చేయూత నిచ్చి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును కల్పిస్తున్నారన్నారు. ఎస్సీ , ఎస్టీల లో చాలామంది చదువుకొని ఉద్యోగాలతో సరిపెట్టు కుంటున్నారని , వారికి పరిశ్రమలపై సరియైన అవగాహన , ప్రోత్సాహం లేకపోవడం తో ముందుకు రాలేక పోతున్నారన్నారు. మన ముఖ్యమంత్రి ఎస్సీలు ఎస్టీలు శ్రామికులుగా మిగిలి పోకూడదు, పెద్ద పారిశ్రామిక వే త్తలుగా ఎదగాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా పలు రాయితీలను
కల్పిస్తున్నా రన్నారు. భూ రిజర్వేషన్ కు సంబంధించి ఏపీఐఐసీ లలో అభివృద్ధి చేసిన భూమిలో 16 శాతం ఎస్సీలకు, ఆరు శాతం ఎస్.టి పారిశ్రామికవేత్తలకు కేటాయించారన్నారు. స్టాంపు డ్యూటీ రద్దు, విద్యుత్ చార్జీలలో రాయితీ ,వడ్డీ లో రాయితీ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిలో రాయితీ, సేవ మరియు రవాణా రంగంలో రాయితీ కల్పించడం జరుగుతుందన్నారు. విత్తన మూల ధన సహాయం, నాణ్యత ధృవీకరణ యోగ్యతాపత్రం అందించబడుతుందని, అదే విధంగా నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణా కార్యక్రమాలను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తుందన్నారు. గతంలో చట్టం ఉన్నా సరైన రీతిలో అమలు కాలేదని,ముందు చట్టాలు కార్యరూపం దాల్చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు . ఇక నుండి ఈ పాలసీ మీద అన్ని నియోజకవర్గాల పరిధిలో ఎస్సీ ఎస్టీ ఔ త్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు మంత్రి సూచించారు. ఇంక్యుబేషన్ సెంటర్లలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మొదటి దశ నుండే శిక్షణ అందించి వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతిభావంతులను ప్రోత్సహించాలని , వారిలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం కల్పించి వారి కలలను సాకారం చేయాలన్నారు. రాబోయే రోజులలో విశాఖ పారిశ్రామిక, విద్యా , పర్యాటక రంగాలలోనూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, వారు మరి కొందరికి ఉపాధి కల్పించే విధంగా మారాలన్నఆకాంక్షను వ్యక్తపరిచారు. బ్యాంకర్లు వారికి రుణ సౌకర్యాన్ని అందించి ప్రోత్సహించాలన్నారు. పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ జగనన్న వైయస్సార్ బడుగు వికాసం పాలసీ అణగారిన దళిత, గిరిజన వర్గాల ఆర్థిక స్వావలంబన, సామాజిక చైతన్యం కల్పించడానికి ప్రవేశ పెట్టారన్నారు. ఎస్సీ ఎస్టీలకు దసరా దీపావళి కానుకగా ఈ పాలసీ అందిస్తున్నందుకు వారి తరఫున కృతజ్ఞతలను తెలియజేస్తున్నానన్నారు.
అరకు శాసనసభ్యులు శెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ గిరిజనులకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏజెన్సీలో మెడికల్ కాలేజీ ,స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారని, అదేవిధంగా అటవీ హక్కు చట్టాన్ని కల్పించారని, రవాణా, కమ్యూనికేషన్ వంటి రంగాలలో సుమారు రూ 650 కోట్లతో మౌలిక అభివృద్ధి పనులను చే పడుతున్నారన్నారు. ఏజెన్సీ పర్యాటకంగా అభివృద్ధి లో ముందు ఉందని, పర్యాటకులను ఆకర్షించేందుకు హోటళ్ల నిర్మాణానికి గిరిజన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. ఇక్కడ పండే ఆర్గానిక్ పంటలు దళారులతో సంబంధం లేకుండా రవాణా జరిగే విధంగా చూడాలన్నారు.
పాడేరు శాసనసభ్యులు కే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికై నూతన అధ్యాయాన్ని తెర మీదకు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి దేననిి ,వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ పాలసీని ప్రవేశపెట్టారన్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రొక్యూర్మెంట్ పాలసీ కింద ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో పరిశ్రమలను పెట్టుకునేందుకు తక్కువ రేటు కు భూములను ఇవ్వాలన్నారు. చిన్న,భారీ పరిశ్రమల నిర్వహణకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. జాయింట్ కలెక్టర్ -3 ఆర్ గోవింద రావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక పాలసీ సంబంధించి ఫైనాన్షియల్ , నాన్ ఫైనాన్షియల్ పథకాలను పెట్టడం జరిగిందన్నారు. ఏపీఐఐసీ ,జిల్లా పరిశ్రమల కేంద్రం ప్రతి ఆర్గనైజేషన్లో జగనన్న వైయస్సార్ బడుగు వికాసం పేరుతో ప్రత్యేకంగా ఒక సెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిశ్రమలు పెట్టుకునేందుకు ఉత్సాహం ఉన్నవారు ప్రభుత్వం అందించే 8 రకాల సబ్సిడీలను పొందవచ్చునన్నారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి,అదీప్ రాజ్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగరాజు, ఏపీఐఐసీ జడ్ ఎం యతిరాజులు ,డిక్కీ, సిక్కిి ప్రతినిధులు రాంజీఅంబేద్కర్, రాజేంద్రప్రసాద్ తదితరులు హాజరయ్యారు.