పుష్కరఘాట్ పనులు సత్వరమే పూర్తిచేయాలి..
Ens Balu
2
పుష్కరఘాట్
2020-10-31 13:21:04
పుష్కరఘాట్ పనులు సత్వరమే పూర్తిచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు.శనివారం కర్నూల్ నగరంలో తుంగభద్ర పుష్కర ఘాట్ల ఏర్పాట్ల పనులను మంత్రి బుగ్గన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అనుకున్న లక్ష్యాలను సాధించాలని, ఈ విషయంలో ఇంజనీరింగ్ అధికారులు పనులు పూర్తిచేసేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నంద్యాల చెక్పోస్ట్ నుండి నగరంలో వేసిన R&B రోడ్ ,సంకల్ బాగ్, రాఘవేంద్ర మట్ పుష్కర ఘాట్ లలో నిర్మాణ పనులను, డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) రవి పటన్ షెట్టి, నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.