భైరి సింగుపురంలో ఆధార్ కేంద్రం..


Ens Balu
3
Srikakulam
2020-11-10 18:15:33

శ్రీకాకుళంతలోని భైరి సింగుపురం యూనియన్ బ్యాంకు శాఖలో ఆధార్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు మంగళ వారం ప్రారంభించారు. ప్రస్తుతం ఆధార్ అత్యంత అవసరమైన డాక్యుమెంటని ప్రసాద రావు అన్నారు. ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డుగా కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. సింగుపురం ప్రాంత వాసులు ఆధార్ కార్డుకు బ్యాంకు శాఖలో ఏర్పాటు చేసిన కేంద్రం నుండి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కొత్త కార్డులను ఉచితంగా నమోదు చేస్తారని, పాత కార్డులలో చేర్పులు మార్పులకు రూ.50 వసూలు చేస్తారని వివరించారు. ఆధార్ కేంద్రం సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఆధార్ కార్డు లేనివారు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ మరియు జిల్లా బ్యాంకర్ల కమిటి కన్వీనర్ పి.కృష్ణయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ జి.వి.బి.డి.హరిప్రసాద్, యూనియన్ బ్యాంకు నోడల్ అధికారి మరియు బ్రాంచి మేనేజర్ ఎస్.కె.సాహూ తదితరులు పాల్గొన్నారు.