భయం గుప్పెట్లో శంఖవరం మండలం...
Ens Balu
4
2020-07-26 18:18:46
శంఖవరం మండలంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకూ గ్రామంలో 23 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో ఇద్దరు మరణించారు. దీంతో పాజిటివ్ కేసులు వచ్చిన చోట రెడ్ జోన్లుగా ప్రకటించి అక్కడ సచివాలయ అధికారులు ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా వైరస్ అధికంగా విస్తరిస్తున్నందున అత్యవసర సమయాల్లో తప్పా ఎవరూ బయటకు రాకూడదని శంఖవరం పీహెచ్సీ డాక్టర్ ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకూ మండపంలో 4, శ్రుంగవరంలో 8, చామమవరంలో 1 కేసులు నమోదు అయ్యాయన్నారు. బయటకు వచ్చేవారు మాస్కును ఖచ్చితంగా వినియోగించాలని కోరుతున్నారు. అంతేకాకుండా తరచుగా చేతులు, కాళ్లూ సబ్బుతో కడుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని, తరచుగా వేడినీరు కూడా సేవించాలని చెబుతున్నారు. ప్రజలు సహకరించకపోతే కేసులు మరిన్ని పెరిగే ప్రమాదముందని కూడా డాక్టర్ హెచ్చరిస్తున్నారు.