అన్నవరంలో మరో 7గురికి కరోనా పాజిటివ్...
Ens Balu
4
East Godavari
2020-07-27 16:00:43
అన్నవరంలో సోమవారం మరో 7గురుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. బిసికాలనీలో ఇద్దరికీ, చలమయ్య నగర్ లో ఇద్దరికి, మరో ఇద్దరు నాయీ బ్రాహ్మణులకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. బిసి కాలనీకి చెందిన ఒక వ్రత పురోహితుడు, ఆయన కోడలికి కరోనా సోకింది. దీంతో ఈ ప్రాంత వాసులంతా ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా మార్చి ప్రత్యేక శానిటేషన్ పనులు చెపడుతున్నట్టు కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అత్యవసర పనులకు తప్పా మిగిలిన పనులకు బయటకు రాకూడదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్ జోన్ పరిధిలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం ముంచుకొస్తుందని సచివాలయ అధికారులు హెచ్చరిస్తున్నారు.