ఫ్యూజన్ ఫుడ్స్ అక్రమ లీజుకి కాలం చెల్లింది..


Ens Balu
5
Visakhapatnam
2020-11-15 11:20:35

ఫ్యూజన్ ఫుడ్స్ అరాచకాలకు కాలం చెల్లింది..వేలంపాట లేకుండా అప్పనంగా ఇంతవరకూ కాలం గడిపిన ఆ రెస్టారెంట్ ను అదే వేలం పాట నిబంధనలతో ప్రభుత్వం ఆదివారం ఖాళీచేయించింది..అంతేకాదు అక్రమంగా ఎవరు వ్యవహరించినా ఇదే పరిస్థితి వస్తుందనే సంకేతాలు కూడా ఇచ్చారు వుడా అధికారులు...విశాఖలో వీఎంఆర్‌డీఏ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా  కొనసాగుతున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌ను అధికారులు ఖాళీ చేయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడేళ్ల వరకు మాత్రమే లీజు కొనసాగించాల్సి ఉన్నప్పటికీ దశాబ్దాల కాలంగా ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ వీఎంఆర్‌డీఏ స్థానంలోనే అలాగే కొనసాగుతూ వచ్చేసింది.. 2015 నుంచి 24 వరకు అనుమతులు ఇస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. వాస్తవానికి మూడేళ్లపాటు మాత్రమే అనుమతి ఇవ్వడమే కాక ఆ తర్వాత కొనసాగించాలంటే వేలంపాట వేయాల్సి ఉంది.  కానీ ఈ నిబంధనలు పాటించకుండానే తొమ్మిదేళ్ల పాటు తాజాగా అనుమతులు పొంది ఫ్యూజన్ ఫుడ్స్ కొనసాగుతోందన్న ఫిర్యాదుపై వీఎంఆర్‌డీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. సామాగ్రిని యజమానికి అప్పగించి ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహితుడిగా పేరొందిన హర్ష కుమార్ ఈ ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ నిర్వాహకుడు కావడం విశేషం. ఆ కారణంగానే ఎలాంటి వేలం పాట లేకుండా మూడేళ్లకు ఒకసారి నిర్వహాంచాల్సిన వేలం పాటకూడా పెట్టకుండా 2024 గడువున్నా అధికారులు మాత్రం పాత నిబంధనల ఆధారంగా ఫ్యూజన్ ఫుడ్స్ ను ఖాళీ చేయించారు.  ఇక్కడ విశేషం ఏంటంటే సిరిపురం జంక్షన్ వద్ద ఉడా నుంచి లీజుకు తీసుకున్న ఆస్తిని టీడీపీ నేత హర్ష రెండింతల అద్దెకు మరొకరికి ఇవ్వడమే. అంటే ఇక్కడ ప్రభుత్వం ఎంత ఆదాయం కోల్పోతుందో అర్ధమవుతుంది. దీంతో అక్రమ లీజుపై ఉక్కుపాదం మోపిన అధికారులు లీజుదారుడిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఈ విషయం విశాఖలో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాకుండి వుడా నిర్వహించే మిగిలిన షాపుల లీజులను కూడా ప్రభుత్వం మరోసారి తనిఖీలు చేపడుతోంది. ఇలానే మిగిలిన షాపుల్లో కూడా అక్రమాలు జరిగితే వాటిని కూడా ఖాళీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది..