ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1వరకే బ్యాంకు సేవలు


Ens Balu
3
Visakhapatnam
2020-07-27 18:15:45

విశాఖపట్నం జిల్లాలో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న సందర్భంగా, వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి గాను జిల్లాలోని బ్యాంకుల యూనియన్ రిప్రెజెంటషన్ పరిశీలించిన పిదప, జిల్లాలోని అన్ని బ్యాంకుల బిజినెస్ కార్యకలాపాలు ఉ. 9 నుండి మ. 1. వరకు మరియు ఆఫీసు పని వేళలు మధ్యాహ్నం 1 నుండి 2 వరకు నిర్ణయిస్తూ జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఆగష్టు 31 వరకు గాని లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇవే పనివేళలు కొనసాగుతాయి. బ్యాంకు సేవలకు అనుగుణంగా ప్రజలు తమ అవసరాలు చూసుకోవాలన్నారు. అవసరం ఉంటే తప్పా ఎవరూ బయటకు రాకూడదన్నారు. ప్రతీఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించడంతోపాటు, తరచుగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, ముసలి వారికి వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా బలవర్ధక ఆహారాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు.