బాలలసేవ..మాధవుడిసేవ..


Ens Balu
2
ఉడా కాలనీ
2020-11-15 17:48:14

బాలలకు సేవ చేస్తే అది మాధవుడికి సేవచేనట్టేనని  మధురవాడ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శిలు నక్కా శ్రీధర్, అచ్యుతరావు లు పేర్కొన్నారు. ఆదివారం మిథిలాపురి ఉడా కాలనీలో.. బాలల దినోత్సవం సందర్బంగా సన్ ఫ్లవర్ దివ్యాంగ బాలల కేంద్రానికి నిత్యవసర వస్తువులు, దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, అనాధశరణాలయంలో పెరుగుతున్న బాలలకు నా అనేవారు లేరనే బాధను తొలగించాలంటే మనసున్న దాతలు ముందుకి వచ్చి వారికి తమవంతు సహకారం అందించాలన్నారు. పిల్లలు దేవుడితో సమానమని, అందులోనూ దివ్యాంగులను సేవచేస్తే అది మాధవుడికే చెందుతుందని అన్నారు. మధురవాడ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేష్ ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ అసోసియేషన్ ద్వారా కొంత చేయూత అందించినట్టు చెప్పారు. ప్రతీఏటా తమ అసోసియేషన్ తరుపుతన సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని ఉపాధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పోతిన శివ, లొడగల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.