జర్నలిస్టులూ హెల్త్ కార్డ్ ప్రీమియం మరిచిపోవద్దు..


Ens Balu
4
Visakhapatnam
2020-11-15 18:16:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2020-21 ఆర్ధిక సంవత్సరానికి పొడిగిస్తూ జీవో యం.యస్ నెం. 122, ను ఈ నెల 01.10.2020 న ఉత్తర్వులు జారీ చేసినట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు తెలియజేశారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్లు కలిగి (1 అక్టోబరు నెల నుంచి డిసెంబర్ 31 2020) వరకు రెన్యూవల్ చేయించుకున్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం క్రింద 30.11.2020 తేది లోపు ప్రీమియం పైకం రూ. 1250/- www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి 31.03.2021 వరకు లబ్ధి పొందాలని శ్రీనుబాబు కోరారు. Head of Account: 8342-00-120-01-03-001-001 , DDO Code: 2703-0802-003  లో ప్రీమియం చెల్లించిన జర్నలీస్టులు ఒరిజనల్ చలానా, రెన్యూవల్ చేయించుకున్న రాష్ట్ర , జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డు జిరాక్సు కాపీలను విశాఖలోని సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. అత్యవసర సమయంలో జర్నలిస్టులకు ఆపద్భాందవిగా హెల్త్ కార్డు పనిచేస్తుందనే విషయాన్ని జర్నలిస్టులు గుర్తించుకోవాలన్నారు.