APEPDCL ఫైనాన్స్ డైరెక్టర్ గా డి.చంద్రం..


Ens Balu
2
Visakhapatnam
2020-11-16 16:51:19

ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) ఫైనాన్స్ డైరెక్టర్  గా డి.చంద్రం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2012 ఐ.ఆర్.ఎ.ఎస్ బ్యాచ్ కి చెందిన ఈయన సౌత్ ఈస్ట్రన్  రైల్వే, కోల్ కతాలోని డిప్యూటీ ఫైనాన్సియల్ అడ్వైజర్ చీఫ్   అకౌంట్స్ ఆఫీసర్ గా, రాంచీ(జార్ఖండ్)లో సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ గా వివిధ హోదాలలో పనిచేశారు. చంద్రం స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని సావరకోట మండలం  చీడిపూడి. ఎస్.ఎం.పుర్ం ఏపి  రెసిడెన్సియల్ స్కూలులో ప్రాధమిక విధ్య, విశాఖలో మెకానికల్ లో పాలిటెక్నిక్, అనంతరం ఐఐటి కాన్పూర్ నుంచి ఎంటెక్ పూర్తిచేశారు. బాధ్యతలు స్వీకరించిన చంద్రంకు సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)కె.రాజబాపయ్య, డైరక్టర్ (ఆపరేషన్స్) బి.రమేష్ ప్రసాద్, సీ జీ ఎం లు, వివిధ్ యూనియన్, అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.