ఏజెన్సీలో అక్రమ మైనింగ్‌లను నిరోధించండి..ఎమ్మెల్యే
Ens Balu
3
Paderu
2020-08-09 20:29:52
విశాఖ మన్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను తక్షణమే నిరోధించాలని పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అనంతరం ఐటిడి ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వి . వినయ్ చంద్ పాడేరుశాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి , అరుకువేలీ శాసన సభ్యులు చెట్టి పాల్గుణలతో సమావేశ మయ్యారు. గిరిజన ప్రాంతంలో ఉన్న రహదారి, తాగునీటి సదుపాయాలు, ఇంటర్నెట్ సేవలు, వైద్య సేవలు, సచివాలయ భవన నిర్మాణాలపై సుధీర్ఘంగా చర్చించారు. పాడేరుశాసన సభ్యురాలు, జి.కె. వీధి, కొయ్యూరు,పాడేరు చింతపల్లి రహదారి వ్యవస్దను కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అదే విధంగా చింతపల్లి మండలం రాజుపాకలు గ్రామం వద్ద ప్రభుత్వం ఇచ్చిన డి.ఫారం భూముల్లో అక్రమంగా లేటరైట్ తవ్వకాలు జరుగుతున్నాయని వాటిని వెంటనే నిలుపుద ల చేయాలని చెప్పారు. రా ష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎటువంటి మైనింగ్ అనుమతులు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రెన్యువల్ చేయకుండా అక్రమంగా లేటరైట్ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ మాట్లాడుతూ ఏజెన్సీలో ఇటీవల కురిసిన వర్షాలకు ఘాట్‌రోడ్డులో కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయని వాటి తొలగింపు చర్యలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇంజనీరింగ్ అధికారులు ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. నియోజక వర్గంలోని రోడ్లు, భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయించాలని , తాగునీటి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వేంటనే రహదారులు భవనాల శాఖ ఎస్ ఇ తో ఫోనులో మాట్లాడి ఐటిడి ఏ పి ఓ నేతృత్వంలో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. అరకు ఏరియా ఆసుపత్రిలో సిజేరియన్ శస్త్ర చికిత్సలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రూ.1.50 లక్షల వేతనం ఇస్తామని జనరల్ మెడిషన్, గైనకాలజిస్టులు, అనస్తీషియా, చిన్న పిల్లల వైద్య నిపుణులను నియమించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఐటిడి ఏ పి ఓ డా. వేంకటేశ్వర్ సలిజామల, మెడికల్ కౌన్సిల్ సభ్యులు డా. నర్సింగరావు, గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ కెవి ఎస్ ఎన్ మూర్తి, పంచాయతీరాజ్ ఈ ఈ కుసుమ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.