నాడు-నేడు పనులు సత్వరం పూర్తిచేయాలి..


Ens Balu
3
Visakhapatnam
2020-12-23 20:30:53

జివిఎంసీ పరిధిలోని అన్ని పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను సత్వరమే పూర్తిచేయాలసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన  నాల్గవ జోన్ పరిధిలోని 47వ వార్డులో గల శ్రీహరిపురం ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పాఠశాలలో జరుగుచున్న నాడు–నేడు పనుల పురోగతిని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా పూర్తిచేయుటకు గాను సంబందిత అధికారులతో ప్రతీ రోజూ చర్చించాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకొనే బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులపై ఉందని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా, పిల్లలకు పరిశుభ్రతపై అవగాహనను ఉపాధ్యాయులు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా, తడి-పొడి వేరు చేసి చెత్తను అందించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ప్లాస్టిక్ బ్యాగులు ఉపయోగం నిషేధం వంటి వాటిపై విద్యార్ధులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలను ప్రతీరోజూ శుభ్రపరచాలని, శానిటరి ఇన్ స్పెక్టరును ఆదేశించారు. 10వ తరగతిలో ఉన్నతస్థాయి మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యార్ధినీ విద్యార్ధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులు, 47వ వార్డు శానిటరీ  ఇన్ స్పెక్టరు తదితరులు పాల్గొన్నారు.