ఉత్తరాంధ్రాకు అన్యాయం చేయడానికే రాజధాని అడ్డంకి..


Ens Balu
3
Narsipatnam
2020-08-10 21:01:35

రాజధాని విషయం పై మాట్లాడే అర్హత మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు కు లేదని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. సోమవారం నర్సీపట్నంలో  మీడియాకి విడుదల చేసిన వీడియోలో కీలక అంశాలపై మాట్లాడారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు అమరావతి ని పూర్తి చేయలేదన్నారు. ఆ విషయం మర్చిపోయి నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి  కి వస్తున్నా ప్రజాదరణను చూసి వార్వలేక ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. అసలు ఉత్తరాంధ్రా అభివ్రుద్ధి చెందడటం టిడిపికి ఇష్టం లేకే మూడు రాజధానుల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి ఏ స్థాయిలో గొంతు చించుకున్నా ప్రజలు నమ్మే స్థితిలో లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజకీయ ఆటల్లో ఓడిపోయి మనస్సును చంపుకున్న అయ్యన్నపాత్రుడు ఇప్పటికైనా పద్ధతిని మార్చుకోవాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హితవు పలికారు...