కానిస్టేబుల్ సాహసంతో నిలిచిన యువకుడి ప్రాణం...


Ens Balu
3
Aalamuru
2020-08-11 14:07:44

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి గోదావరి పాత బ్రిడ్జి పై నుండి గోదావరిలోకి దూకిన యువకుడిని  హెడ్ కానిస్టేబుల్ (కోర్టు కానిస్టేబుల్ ) జి ప్రభాకర్ రావు ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు తెలుసుకుంటే.. అంగర గ్రామానికి చెందిన ఎర్ర రమేష్ రావులపాలెం వైపునుండి జొన్నాడ వైపు వస్తుండగా ప్రాత బ్రిడ్జి నుంచి గోదావరిలోకి పడి పోతుండగా  కొత్త బ్రిడ్జి పై రావులపాలెం వైపు వెళ్ళుతున్న హెడ్ కానిస్టేబుల్ ప్రభాకరరావు గమనించారు. వెంటనే లారీని ఆపి తాడుతీసుకొని కొత్త బ్రిడ్జి స్తంభాన్ని పట్టుకున్న యువకుడు రమేష్ ను స్థానికుల సహాయంతో పైకి లాగి ప్రాణాలను కాపాడాడు. హెడ్ కానిస్టేబుల్ చేసిన సాహసానికి స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.ఈ  విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎస్ శివ ప్రసాద్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా యువకుడు  గోదావరిలో పడిన సంఘటన పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి .