విశాఖ ఖర్మాగారాల్లో ప్రమాదాలపై వామపక్షాల ఆందోళన


Ens Balu
3
Visakhapatnam
2020-08-13 20:02:49

విశాఖపట్నం ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలను అరికట్టాలని, ప్రమాదాలకు కారణమైన యాజమాన్యాలకు కఠినంగా శిక్షించాలని, కార్మికులకు రక్షణ కల్పించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. గురువారం విశాఖలో జీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట  వరుస ప్రమాదాలపై సిఐటియు, ఎఐటియుసి, ఐ.ఎన్‌.టి.యు.సి., ఐఎఫ్‌టియు, ఎఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్ధేశించి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగిన తరువాత కార్మికులకు నష్టపరిహారాలు ప్రకటించి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయని విమర్శించారు. వరుసుగా ప్రమాదాలు జరుగుతున్నా భద్రతా చర్యలు కోసం నోరుమెదపడం లేదన్నారు. పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించకుండా సంబంధిత శాఖలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయగా ప్రస్తుత బిజెపి, వైసిపి ప్రభుత్వాలు అదే విధానాన్ని కొనసాగించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవడంలో తీవ్ర వైఫల్యం ప్రదర్శిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టే విధంగా, కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో విశాఖ కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమిస్తోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, పబ్లిక్‌ సెక్టార్‌ కోఆర్డినేషన్‌ కమిటీ కో కన్వీనర్‌ సిఐటియు నాయకులు కె.ఎం.కుమార్‌మంగళం, ఐఎన్‌టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, కొండయ్య, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి జి.వామనమూర్తి, ఎఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి గణేష్‌పాండా, సిఐటియు నాయకులు ఎం.సుబ్బారావు, వి.కృష్ణారావు, ఆర్పీ రాజు, అప్పలరాజు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.