9వ విడత ఉచిత రేషన్ సరకుల పంపిణీ పూర్తి...జెసి


Ens Balu
2
Srikakulam
2020-08-13 20:19:43

శ్రీకాకుళం జిల్లాలో  9వ  విడత  ఉచిత రేషన్  సరకుల పంపిణీ కార్యక్రమం  పూర్తి అయినట్లు  సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ మీడియాకి వివరించారు.  ఈ కార్యక్రమం ద్వారా  తెలుపు రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు  పంపిణీ చేయడం జరిగిందని జె.సి. తెలిపారు.  అదే విధంగా రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్న  అర్హులైన వారికి కూడా రేషన్ సరకులను ఇవ్వనున్నామని తెలిపారు. కరోనా సమయంలో నిరుపేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం బియ్యం, కందిపప్పు ను తెలుపు రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన  కుటుంబ సభ్యులలో ఒక్కొక్కరికీ 5 కిలోల బియ్యాన్ని, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసామని తెలిపారు. అదే విధంగా కిలో కందిపప్పును ఉచితంగా పంపిణీ చేసిన్నట్లు  తెలిపారు.  తెలుపు రేషన్ కార్డుదారులందరికీ  ½ కిలో రూ. 17/- లకు      పంచదారను  అందించామన్నారు. . జిల్లాలో వున్న  8 లక్షల 29 వేల 69  తెలుపు రేషన్ కార్డుదారులందరికీ రేషన్ సరకులను పంపిణీ చేయడం జరిగిందని  తెలిపారు.  15,237 మంది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరకులను అందచేయడం జరిగిందన్నారు.