రక్త నిల్వలు వినియోగించుకోవాలి..
Ens Balu
3
Srikakulam
2021-01-19 19:40:14
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, శ్రీకాకుళం శాఖ బ్లడ్ బ్యాంకులో ఉన్న రక్త నిల్వలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి. జగన్మోహన రావు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, బ్లడ్ బ్యాంకులోని రక్తనిల్వల వివరాలను తెలియజేశారు. ఓ పాజిటివ్ : 122, ఏ పాజిటివ్ : 123, బి పాజిటివ్ : 92, ఏబి పాజిటివ్ : 27, ఓ నెగిటివ్ : 05, ఏ నెగిటివ్: 04, బి నెగిటివ్: 05, ఏబి నెగిటివ్ : 03, ప్లేట్లెట్స్:24 రక్త గ్రూపులు అందుబాటులో ఉన్నాయని తలసేమియా, సికిలిసెల్ అనీమియా, గ్రాస్ అనీమియా, డయాలసిస్, కాన్సర్, గవర్నమెంట్ హాస్పిటల్ లో రక్తం అవసరమగు రోగులకు ఉచితంగా పైన తెలిపిన బ్లడ్ యూనిట్స్ ఉన్నంతవరకు ఇస్తున్నామని మరియు ఇతర ప్రైవేటు హాస్పిటల్లలో ఉన్న రక్తం అవసరమగు రోగులకు డోనార్ ని అడగకుండా వారికి కావలసిన రక్త యూనిట్ లను అందచేస్తున్నామని ఆయన వివరించారు.