భీమిలీ నియోజకవర్గం క్లీన్ స్వీప్ లక్ష్యం..
Ens Balu
3
Visakhapatnam
2021-01-27 20:04:32
భీమిలీ నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలు క్లీన్ స్వీప్ చేసి సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి బహుమతిగా అందించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, త్వరలో అందించబోయే సంక్షేమ పథకాల విషయాన్ని ప్రజలకు తెలియజేసి పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాలు సర్పంచులు గెలవాలన్నారు. ఆ బాధ్యత మండలాల వారీగా పార్టీ నాయకులు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పంచాయతీల వారీగా సర్పంచ్ అభ్యర్ధులు కూడా ప్రజలతో మమేకమై గెలుపుదిశగా పనిచేయాలన్నారు. ఇప్పటికే ప్రజలు ప్రభుత్వంపై ఎంతో విశ్వాసంతో ఉన్నారని దానిని సర్పంచ్ అభ్యర్ధులు వాటిని నిలబెట్టు కోవాలన్నారు. అయితే చంద్రబాబు చేస్తున్నదుష్ప్రచారాలను తిప్పి కొట్టే విధంగా సంక్షేమ పథకాలు సంబందించిన కరపత్రాలను ప్రతి ఇంటికి అందించటంతో పాటు వాటికి సంబంధించిన వివరాలను తెలియపరచాలని కోరారు. అలాగే పార్టీలో నాయకులు కార్యకర్తలు కలసికట్టుగా సమన్వయం తో పనిచేసి ప్రతి ఓటు పార్టీ సానుభూతి అభ్యర్దులు ఓటు పడే విధంగా ప్రత్యేక శ్రద్ధ తో పని చేయాలన్నారు.రాబోయే రోజుల్లో విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని దీని ద్వారా అన్ని ప్రాంతాలు ఉన్నత స్థాయిలో అభివృధ్ధి సాదించటంతో పాటు ప్రజలకు సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుతాయని ఈ విషయాలను కూడా ప్రత్యేకించి వివరించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు. పంచాయతీ ఎన్నికలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన ఈ విధంగా గ్రామాలలో ప్రశాంత నెలకొనేలా ఏకగ్రీవలకు ప్రాధాన్యత ఇవ్వంలన్నారు.రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలనుకు ఐదు లక్షల ప్రోత్సాహం రెండు వేల నుండి ఐదు వేల జనాభా పంచాయతీలు ఏకగ్రీవనికి 10 లక్షలు ఐదు వేల నుండి పదివేల జనాభా పంచాయతీలకు 15 లక్షలు పదివేలకు పైనున్న పంచాయతీ ఏకగ్రీవలకు 20 లక్షలు ప్రోత్సాహకాలు ఇవ్వటం జరుగుతుందన్నారు.నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయితీలలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి పంచాయతీ పోరులో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కోరారు.ఈ సమావేశంలో భీమిలీ,ఆనందపురం , పద్మనాభం మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీ, జడ్పీటిసి అభ్యర్దులు పాల్గొన్నారు.