కంట్రోల్ రూమ్ పనితీరు ఆదర్శవంతంగా ఉండాలి..
Ens Balu
4
Kakinada
2021-01-30 20:56:25
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరు ప్రశంసనీయంగా ఉండాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. శనివారం కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి , జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారిలతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలిస్తూ క్షేత్ర స్ధాయిలో ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించే విధంగా ఆయా విభాగాలు సజావుగా పని చేయాలన్నారు. ఎవరైనా ఫోన్ ద్వారా గానీ, నేరుగా గానీ ఏదైనా సమాచారం కోరితే ఇవ్వాలన్నారు. అదే విధంగా ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఈ పరిశీలనలో డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, జిల్లా పంచాయతీ అధికారి ఎస్.వి.నాగేశ్వర్ నాయక్, మెప్మా పిడి శ్రీరమణి, తదితరులు పాల్గొన్నారు.