నిత్యాన్నదానాలకు రూ.2 లక్షలు విరాళం..


Ens Balu
1
Srikakulam
2021-02-01 13:12:20

శ్రీకాకుళంలోని అరసవల్లి, శ్రీకూర్మం నిత్యాన్నదాన్న కార్యక్రమాలకు రూ.2 లక్షలు విరాళం అందాయి. నిత్యాన్నదానానికి రూ.2 లక్షలను సంఘ సేవకులు బరాటం కామేశ్వరరావు, రాజ్యలక్ష్మీ దంపతులు, కుమారుడు సతీష్‌దివ్యతో కలిసి సోమవారం అందించారు. శ్రీకూర్మం నిత్యాన్నదానానికి రూ.లక్షను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు ద్వారా ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్‌కు అందించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఉన్నతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. సమాజానికి మంచి చేసే ఇలాంటి కుటుంబానికి  చేయూతను అందిస్తామన్నారు. విరాళ దాత మాట్లాడుతూ, నిత్యాన్నదానానికి తమవంతుగా స్వామి ఆలయానికి విరాళం అందించడం ఆనందంగా ఉందన్నారు. అన్నదానం నిరాటంకంగా సాగేందుకు తమ వంతు బాధ్యతగా అరసవల్లి, శ్రీకూర్మంకు చెరో లక్ష అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరసవిల్లి పాలకమండలి సభ్యులు మండవల్లి రవి, అంధవరపు రఘు, మండల మన్మధరావు, గాయత్రి, ఏపిడబ్ల్యుజేఎఫ్‌ ‌రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్‌ ‌క్లబ్‌ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్‌, ‌గుర్తు చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.