పారదర్శకంగా పంచాయతి ఎన్నికలు..


Ens Balu
2
Vijayawada
2021-02-01 17:53:21

నిజాయితీ, ఖచ్చితత్వం, పారదర్శకతతో ఎ న్నికల పోలింగ్ ప్రక్రియ, ఫలితాల వెల్లడి చేపట్టాలని క్రిష్ణాజిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. స్ధానిక ఇరిగేషన్ కార్యాలయ రైతుశిక్షణా కేంద్రంలో సోమవారం కృష్ణాజిల్లా ఎ న్నికల పరిశీలకులు టి.యస్. బాలాజీరావు, జాయింట్ కలెక్టర్లతో కలిసి విజయవాడ డివిజన్ పరిధిలోని స్టేజ్-2 ఆఫీసర్ల శిక్షణా కార్యక్రమంలో కలెక్టరు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ స్టేజ్-2 ఆఫీసర్లు ఎ న్నికల రిటర్నింగ్ అధికారులుగా ఎ న్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ప్రకటించిన తర్వాత గురుతరమైన బాధ్యతను చేపట్ట ఉండాల్సి ఉందన్నారు. 4వ తేదీ సాయంత్రం ఎ న్నికల పోటీలో నిలిచే అభ్యర్ధులను ప్రకటించిన సమయం నుండి ఫలితాల ప్రకటన వరకు రాష్ట్ర ఎ న్నికల కమిషన్, ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను ఖచ్చితత్వంగా పాటించాల్సి ఉందన్నారు. ఎ టువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా విధులను చేపట్టాలని, ఎ న్నికల విధులకు గైర్హాజరు అయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టరు స్పష్టంచేశారు. ఇప్పటివరకు చేపట్టిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగిందని, ఇందుకు అధికారులను, సిబ్బందిని కలెక్టరు అభినందించారు. కృష్ణాజిల్లా ఎ న్నికల పరిశీలకులు యల్.యస్. బాలాజీరావు మాట్లాడుతూ రాష్ట్ర ఎ న్నికల సంఘంకు కళ్లు, చెవులుగా ఎ న్నికల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. రాష్ట్ర ఎ న్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచ తప్పకుండా క్షేత్రస్ధాయిలో విధులు నిర్వర్తించాలన్నారు. ఈవిషయంలో మార్గదర్శకాలను “ రోబో టిక్ ” గా నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఇబ్బందులు కలిగించే అంశాలు ఏమైనా ఉత్పన్నం అయితే వాటిని నివృత్తి చేసుకోవాలన్నారు. ఎ న్నికల ప్రక్రియలో ఎ టువంటి సందేహాలు ఉన్నా ఉన్నతాధికారులను సంప్రదించి ఖచ్చితంతోకూడి ఎ న్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎ న్నికల ప్రక్రియ సరళిని పరిశీలించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జాయింట్ కలెక్టరు (అభివృద్ది) యల్. శివశంకర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎ న్నికల ప్రక్రియ సజావుగా జరిగేలాగా సూచనలు చేయడం జరిగిందన్నారు. ఓటర్లు కనీసం రెండుమీటర్ల దూరాన్ని పోలింగ్ సమయంలో క్యూలైన్లలో పాటించాల్సి ఉందన్నారు. ఎ న్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి గ్లౌజ్‌లు, శానిటైజర్లు, మాస్క్‌లను అందిస్తున్నామన్నారు. ఓటర్లకు శానిటైజ్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక సహాయకుడిని నియమించుకోవాలన్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రం బియల్ఓ వారి పరిధిలోని కరోనాపాజిటివ్ ఉన్న వ్యక్తులను ముందస్తుగానే గుర్తించాల్సి ఉంటుందన్నారు. వారికి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు ఓటింగ్ అవకాశం కల్పిస్తామన్నారు. వారికి ప్రత్యేకంగా పిపిఇ కిట్‌లు కూడా పంపిణి చేస్తామన్నారు. జాయింట్ కలెక్టరు (సంక్షేమం) కె. మోహనరావు మాట్లాడుతూ ఈరోజు నిర్వహించిన స్టేజ్-2 అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నామినేషన్ ప్రక్రియ నుండి బ్యాలెట్ పేపర్లలో అభ్యర్ధులకు గుర్తులు కేటాయింపు, ఓటింగ్ నిర్వహించే రోజున, అంతకుముందు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలను వివరించడం జరిగింది. జడ్‌పి సిఇఓ సూర్యప్రకాష్ మాట్లాడుతు గ్రామపంచాయతి ఎ న్నికల ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు స్టేజ్-2 అధికారులు నిబద్ధతతోకూడి విధులను నిర్వహించాలని ఎ టువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేస్తామన్నారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) కె. మాధవిలత, డిపిఓ ఐ.సాయిబాబా, డివిజినల్ పంచాయతి అధికారి చంద్రశేఖర్ లు, తదితరులు పాల్గొన్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండువిడతలుగా విజయవాడ డివిజన్ పరిధిలోని 234 గ్రామపంచాయతీలలో నియమించిన స్టేజ్-2 అధికారులు ఈశిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశంలో స్టేజ్-2 అధికారులు అడిగిన సందేహాలను కలెక్టరు, తదితరులు నివృత్తి చేశారు.