పిల్లలకు పౌష్టికాహారం తప్పక అందించాలి..
Ens Balu
1
Anantapur
2021-02-05 20:55:16
అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం నగరంలోని రుద్రంపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రం-1 ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ప్రతిరోజు చిన్నారులకు గుడ్లు అందించాలని, చిన్న సైజులో కాకుండా పెద్ద సైజు గుడ్లను ఇవ్వాలన్నారు. వరుసగా కొన్ని రోజులు అంగన్వాడీ కేంద్రానికి చిన్నారులు రాకపోతే వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్నారులకు అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిన్నారుల హాజరు పట్టికను తనిఖీ చేశారు. చిన్నారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీరు ఏం నేర్చుకుంటున్నారు అని అడిగి తెలుసుకుని బాగా ఆడుకోవాలని సూచించారు. ప్రతిరోజు కోడిగుడ్లను తినాలని, కరోనా నేపథ్యంలో చిన్నారుల అంతా ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని, జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం చిన్నారుల తల్లులతో కూడా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు గుడ్లు ఇస్తున్నారా, గర్భవతులకు ప్రతినెలా పౌష్టికాహారం అందిస్తున్నారా అంటూ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో లో ఐసిడిఎస్ పిడి విజయలక్ష్మి, సిడిపిఓ శ్రీదేవి, అంగన్వాడి టీచర్, హెల్పర్, చిన్నారులు పాల్గొన్నారు.