కోవిడ్ వేక్సిన్ విషయంలో అపోహలొద్దు..


Ens Balu
3
Chittoor
2021-02-05 21:37:25

అపోహలు వీడి ఆరోగ్యవంతులుగా ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్లు కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ కోరారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవడం జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా మొదటి విడతలో హెల్త్ కేర్ వర్కర్లకు, రెండవ విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యతా క్రమంలో జరుగుతుందని తెలిపారు. కోవిడ్ సమయంలో హెల్త్ కేర్ వర్కర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్ల సేవలను గుర్తించి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఆరోగ్య సమస్యలు లేని హెల్త్ కేర్ వర్కర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లు ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జెసి (అభివృద్ధి) వి.వీరబ్రహ్మం, డి ఎం అండ్ హెచ్ ఓ మరియు డి సి హెచ్ ఎస్ లు డా. పెంచలయ్య, డా. సరళమ్మ, హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. అరుణ్ కుమార్, అపోలో అడ్మినిస్ట్రేటర్ నరేష్ కుమార్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ డా. మహేష్, ఇతర డాక్టర్లు మరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.