ముక్కంటి బ్రహ్మోత్సవాలకు రండి..
Ens Balu
2
Tirumala
2021-02-05 21:52:48
శివరాత్రి సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆలయ ఈవో పెద్దిరాజు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సివి ఎస్వో గోపీనాథ్ జెట్టీలను ఆహ్వానించారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఈవోపెద్దిరాజు వీరిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక, శ్రీ కాళహస్తీశ్వర స్వామి ప్రసాదాలు,క్యాలెండర్ ను అందించి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి శాలువతో సత్కరించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు టిటిడి అధికారులను ఆహ్వానించడం ఆనవాయితీ వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా టిటిడి ముఖ్య అధికారులతోపాటు చైర్మన్ ను కూడా ఆహ్వానించినట్టు ఈఓ తెలియజేశారు.