పొరపాట్లు లేకుండా ఎన్నికలు జరగాలి..


Ens Balu
5
Visakhapatnam
2021-02-06 20:57:09

విశాఖ జిల్లాలో జరగునున్న పంచాయతీ ఎన్నికలు పోలింగుతో పాటు కౌంటింగు నిర్వహణ లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  శనివారం కలక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలక్టరు మాట్లాడుతూ  9వ తేదీన అనకాపల్లి, 13 తేదీన నర్సీపట్నం డివిజన్లలో జరుగనున్న ఎన్నిక ప్రక్రియలో   అధికారులు, సిబ్బంది ప్రణాళికాయుతంగా, నిబంధనల ప్రకారం విధులను నిర్వహించాలన్నారు.  ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు గావించాలన్నారు. పోలింగు కేంద్రాలలో  అవసరమైన  మౌళిక సదుపాయాలు ఫర్నిచర్, కరెంటు, శానిటేషను, మంచినీరు, మెడికల్ కిట్స్, బోజన సదుపాయాలు తదితర ఏర్పాట్లను నోడల్ అధికారులు తనిఖీ చేయాలన్నారు.  పోలింగు అధికారులు, సహాయ పోలింగు అధికారుల రేండమైజేషను నిర్వహించాలని తెలిపారు.  అన్ని మండలాలకు ఓటర్ల లిస్టులను పంపించాలని, పోస్టల్ బ్యాలెట్ బట్వాడా చేయాలని తెలిపారు. ఈ విషయంలో  జిల్లా పరిషత్, ముఖ్యనిర్వహణాధికారి  మండల అభివృద్ది అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చెయ్యాలని తెలిపారు.   ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు,, సిబ్బంది హాజరు, రిజర్వ్ సిబ్బంది ఏర్పాటుపై  చర్చించారు.  నోడల్ అధికారులు వారికి కేటాయించిన అంశాలపైన,   ఎన్నికలకు సంబంధించి ప్రతి పోలింగు స్టేషనుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిగావించాలని, ఈ విషయంలో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా తగుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు స్పష్టంచేసారు.  ప్రతి పోలింగు స్టేషనులో మౌళిక సదుపాయాలు కల్పించాలని, అభ్యర్థుల లిస్టు, ఓటరు లిస్టు, పోలింగు ఏరియా వివరాలు ప్రదర్శించాలని తెలిపారు. పోలింగు మెటీరియల్ ను మండలంలో సబ్-ట్రెజరీలో భద్రపరచాలని ఈ విషయంపై  ట్రెజరీ డిపార్టుమెంటు ఉప సంచాలకులతో చర్చించి ఏర్పాట్లు చేయాలని, సబ్-ట్రెజరీ వారీ మ్యాపింగు చేయాలన్నారు. పోలింగు సిబ్బంది, మెటీరియల్ రవాణాకు అవసరమైన ఏర్పాట్లపై డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమీషనరు,  ఆర్.టి.సి.రీజనల్ మేనేజరును వివరాలు అడిగి తెలుసుకున్నారు.  సిబ్బందికి అందిస్తున్న రెండవ విడత శిక్షణలో ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలను విశదీకరించాలన్నారు.  సచివాలయ సిబ్బందిని సేవలను వినియోగించుకోవాలన్నారు.  అందుకు గాను మండల అభివృద్ది అధికారులకు సర్కులర్ జారీ చేయాలని తెలిపారు.  కౌంటింగు పూర్తి అయిన పిదప రిటర్నింగు అధికారి సంతకం తో గెలుపొందిన సర్పంచ్, మెంబర్స్ కు ధృవపత్రం జారీచేయాలని  తదుపరి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని తెలిపారు. స్టేజ్-1, స్టేజ్-2 రిసెప్షన్ కౌంటర్స్ ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన సిబ్బంది, మెటీరియల్  సిద్దం చేసుకోవాలని అన్నారు.  పారదర్శకత కొరకు  వెబ్ కాస్టింగ్,  మైక్రో అబ్జర్వర్ లను నియమించాలన్నారు. సున్నిత, అతి సున్నిత పోలింగు కేంద్రాలలో  మైక్రో అబ్జర్వర్ ను తప్పక నియమించాలని అన్నారు. పోలింగు సిబ్బంది, భద్రతా సిబ్బంది కలిసే విధులకు వెళ్లాలని,  బస్సులు వెళ్లని ప్రాంతాలకు చిన్నవాహనాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టరు రవాణా శాఖ అధికారుల ను ఆదేశించారు.  మద్యం అమ్మకాలు, బెల్టుషాపులు, దొంగసారా నియంత్రణకు చర్యలుతీసుకోవలసినదిగా  ఎక్సయిజ్ సూపరిండెంట్ కు, పోలింగురోజుల  విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలని  ఎలక్టికల్  సూపరింటెండెంట్ ఇంజనీరుకు, పోలింగు కేంద్రాలను అవసరమైన మందులు, పి.పి.ఇ.కిట్లు, పంపవలసినదిగా  జిల్లా వైద్యఆరోగ్యశాధికారికి  ఆదేశించారు.  మరుగుదొడ్లు లేని పోలింగు కేంద్రాలలో తాత్కాలిక ఏర్పాట్లు చేయవలసినదిగా సంబంధిత అధికారులను అదేశించారు.  ఎన్నికల సిబ్బందికి అవసరమైన బోజన ఏర్పాట్లు చేయాలని,  పోలింగు స్టేషనుకు 200 మీటర్ల లోపు ఎటువంటి ప్రచారం కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని అదికారులకు జిల్లా కలక్టరు అదేశించారు. జాయింటు కలెక్టరు ఎం.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ  అనకాపల్లి డివిజనులో 78 హైపర్ సెన్సిటివ్, 104 సెన్సిటివ్  పోలింగు స్టేషన్లు ఉన్నాయని వెబ్ కాస్టింగ్,  వీడియో గ్రాఫర్, మైక్రో అబ్జర్వర్ లను నియమించినట్లు,  పోలీసు బందోబస్తు పెంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  జాయింటు కలక్టర్-2 అరుణ్ బాబు, జాయింటు కలెక్టరు (ఆసరా) గోవిందరావు, నోడల్ అధికార్లు హజరయ్యారు.