118 ఆక్వా దరఖాస్తులకు అనుమతులు..


Ens Balu
2
Kakinada
2021-02-06 21:13:46

తూర్పుగోదావరి జిల్లాలో అక్వా అనుమతుల కొరకు అందిన అర్హమైన ధరఖాస్తులపై మండల స్థాయి కమిటీలు త్వరితగతిన పరిశీలన పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో అక్వా రంగ అనుమతుల జారీపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధ్యక్షతన జరిగింది.  సమావేశంలో నిబంధనలను పాటిస్తూ అన్ని అర్హతలు కలిగిన 118 అక్వా ధరఖాస్తులకు కమిటీ ఆమోదించింది.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో 884 ధరఖాస్తులు ఇంకా పెండింగ్ ఉన్నాయని, వీటిని మండల కమీటీల్లోని వ్యవసాయ, మత్స్య, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు  పరిశీలన సత్వరం పూర్తి చేసి జిల్లా కమిటీ ఆమోదానికి పంపాలని ఆదేశించారు.   అక్వా చట్టాలు, నిబంధనలు, అనుమతుల జారీ విధివిధానాలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అమలాపురంలో వర్కుషాపు నిర్వహించాలని సూచించారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మిశ, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, మత్యశాఖ జెడి పి.వి.సత్యన్నారాయణ, జడ్పి సిఈఓ ఎన్ వివి సత్యన్నారాయణ,వ్యవసాయ శాఖ జెడి కె.వి.ఎస్.ప్రసాద్, డిడి రామారావు, పర్యావరణ ఇంజనీరు  ఎ.రామారావు నాయుడు, గ్రౌండ్ వాటర్ డిడి పి.ఎస్.విజయ కుమార్, కమిటీ సభ్యులు సిహెచ్.వి.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.