దుకాణదారులు చెత్తబుట్టలు పెట్టాల్సిందే..


Ens Balu
2
Diamond Park
2021-02-10 22:08:07

మహావిశాఖ నగర పరిధిలోని ప్రతి దుకాణం ముందు రెండు డస్ట్ బిన్ లు ఉండేలా చూడాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లను జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు ఆదేశించారు. బుధవారం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా 2వ జోన్, 15వ వార్డ్ లోని డైమండ్ పార్క్, శ్రీ కన్య థియేటర్ తదితర ప్రాంతాలలో ఏడిసి  పర్యటించి డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ ఏ విధంగా చేస్తున్నారో స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.  శ్రీ కన్య ఫార్ట్యూన్ ఇన్ హోటల్లో వేస్ట్ కలెక్షన్ మిషన్ ఏ విధంగా పనిచేస్తున్నదని ఆరా తీశారు. అనంతరం  నాల్గవ   జోన్,  44వ వార్డు జ్ఞానాపురం లోని  నికోలస్  వీధి  తదితర ప్రాంతాలలో పర్యటించి రోడ్లు, కాలువలు లోని చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. తడి చెత్త-పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులుకు అందించాలని స్థానిక ప్రజలను కోరారు. ప్రతిరోజు కాలువలు, రోడ్లు శుభ్రం చేస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో 15, 44 వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ లతోపాటు వార్డు శానిటరీ  కార్యదర్శులు పారిశుధ్య  కార్మికులు తదితరులు పాల్గొన్నారు.