జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించాలి...


Ens Balu
4
Bhimavaram
2020-08-17 16:16:58

జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి, భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు వి సత్య సాయి బాబా జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.  ఏపియూ డబ్ల్యూజె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సారిగా తీసుకువచ్చిన ఆన్ లైన్ క్యాంపైన్ విజయవంతం చేయాలని ఆయన కోరారు.  సోమవారం ఏపీయూడబ్ల్యూజే 63వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు టి .స్వామి అయ్యప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు వి .సత్య సాయిబాబా గౌరవ సలహాదారులు కడలి వరప్రసాద్ మాట్లాడారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది పాత్రికేయులు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కరోనాతో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళులు అర్పించారు .ఈ సమావేశంలో భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బోనం శ్రీనివాస్, కోశాధికారి జి సుధాకర్ కార్యవర్గ సభ్యులు తాళ్లూరీ  జయకుమార్, హనుమంతరావు, ప్రసన్న కుమార్  ,ఆదిత్య, అయ్యప్ప , నిమ్మల అది ,క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.