విద్యార్ధులకు కంటి అద్దాల పంపిణీకి ఏర్పాట్లు..
Ens Balu
3
Srikakulam
2020-08-24 20:18:01
శ్రీకాకుళం జిల్లాలో పాఠశాల విద్యార్ధులకు కంటి అద్దాలను పంపిణీ చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డా.జి.వి.రమణకుమార్ తెలిపారు. సోమ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డా.వై.యస్.ఆర్.కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. సమగ్ర కంటి వైద్య సేవలు ఉచితంగా అందిoచుటకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2019 అక్టోబరు 10వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇందులో భాగంగా మొదటి, రెండవ దశలలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 12,069 మంది విద్యార్థులకు కంటి అద్దాలు అవసరమని నిర్ధారించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి 6,872 కంటి అద్దాలను బడి పిల్లలకు పంపిణి చేసామని ఆయన తెలిపారు. ఇంకా 5,197 కంటి అద్దాలను ప్రధానోపాద్యాయలు ద్వారా పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు.