ఎన్‌ఎన్‌ఆర్ కు మరోసారి దక్కిన అరుదైన గౌరవం..
Ens Balu
4
విశాఖపట్నం
2020-08-25 18:22:29
విశాఖకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎన్.నాగేశ్వరరావు (ఎన్‌ఎన్‌ఆర్)కు మరో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టస్ ఇండియా (ఎన్‌యూజేఐ) ఆధ్వర్యంలో 3 దశాబ్దాలుగా పని చేస్తున్న స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్‌ఓజే) గవర్నింగ్ కౌన్సిల్‌లో ఎన్.ఎన్.ఆర్.కు స్ధానం లభించింది. వరుసగా రెండవ సారి ఈ అవకాశం ఆయనకు దక్కింది. న్యూఢిల్లీ కేంద్రంగా 1992 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జర్నలిజం స్కూల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వుంది. ఎన్‌యూజేఐ ఉపాధ్యక్షునిగా వరుసగా 2వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్.ఎన్.ఆర్.ను జర్నలిజం స్కూల్ పాలకమండలి సభ్యునిగా తీసుకుంది. జర్నలిజం స్కూల్ పూర్వ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఎన్.ఎన్.ఆర్. కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలను గుర్తించిన పాలకమండలి మరోసారి కౌన్సిల్‌లోకి అవకాశం కల్పించింది. ఈనెల 24వ తేదీన జరిగిన జర్నలిజం స్కూల్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది.