ప్రభుత్వ భూములను ఖబ్జా చేస్తేస్తుంటే స్పందించరా...
Ens Balu
2
నరవ
2020-09-02 12:42:11
మహావిశాఖ నగర పరిధిలోని ప్రభుత్వ భూమిని కబ్జాల నుంచి కాపాడాలని సీపీఐ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, నరవ రెవిన్యూ సత్తివానిపాలెం లో రాష్ట్ర ప్రభ్యత్వం 2006 లో పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన 42.25 ఎకరాల్లో సర్వే నెం 7/4 ఏ3డీ లో సబ్ డివిజన్ చేసి సుమారు 10 ఏకరముల భూమిని కబ్జాచేసి అక్రమంగా లే అవుట్ వేసి ప్రజలకు దర్జాగా అమ్మకాలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని విచారణ జరిపించి విలువైన ఆ భూమిని కాపాడాలన్నారు. ఈ ఆక్రమణలకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్ మెయిల్ పంపినట్టు ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ప్రకటన వెలువడిన తరువాత మరింత వేగవంతంగా నగరం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను భూకబ్జాదారులు హరించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లో ఉన్న పెద్దలు అండదండలు లేకుండా, రెవిన్యూ అధికారులు సహాయ సహకారాలు లేకుండా ఇటువంటి వ్యవహారాలు జరగవన్న అంశాన్ని కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపించి విలువైన ప్రభుత్వ ఆస్థిని కాపాడాలని పైడిరాజు విజ్ఞప్తి చేశారు.