గిరిజనుల సౌంస్కృతి చాలా గొప్పది


Ens Balu
16
Vizianagaram
2022-09-30 11:41:54

గిరిజనుల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ  చాలా ప్రత్యేకమైనవని వాటిపై పరిశోధనలు జరిగి ఆ ఫలితాలు మానవాళికి ఉపయోగకరంగా చెయ్యాల్సిన భాద్యత ఎంతైనా ఉందని గిరిజన విశ్వవిద్యాలయం విసీ ఆచార్య తేజస్వి కట్టిమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి,  గిరిజన సంఘాలు అనే అంశం పై 3 రోజుల జాతీయ అధ్యయన శిబిరం శుక్రవరం కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విసీ మాట్లాడుతూ, గిరజన సంప్రయాలు, కళలు భాహ్యప్రపంచానికి తెలియాల్సిన అవసరం వుందన్నారు. గంగాధర్ మెహెర్ విశ్వవిద్యాలయం విసి ఆచార్య ఎన్. నాగరాజు మాట్లాడుతూ గిరిజన ప్రజా జీవితం వైరుధ్యమైనదని వారి ఆలోచనా సరళి ప్రకృతికి దగ్గరగా ఉండడమే కాకుండా వారిలో దాగివున్న నిగూఢమైన విజ్ఞానం ప్రస్తుత తరుణం లో మానవాళికి ఏంతో ఉపయోగపడుతుందన్నారు. 

సత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ, గిరిజన విశ్వ విద్యాలయం లో నిరంతరం గిరిజనుల స్తితిగతులు, సంప్రదాయాలు మొదలైన అంశాలపై వివిధ వర్కుషాపులు, సెమినార్లు జరుగుతుండడం చూస్తుంటే గిరిజనులకు సంబంధించిన అన్ని విషయాలు విశ్వవ్యాప్తం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అంతకు ముందు జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో సిటియు వైస్-ఛాన్సలర్ ఆచార్య తేజస్వి కట్టిమని తోపాటు సంబల్‌పూర్‌లోని గంగాధర్ మెహెతా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగరాజు, సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీతమ్) డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, బెంగళూరులోని కర్నాటక సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ బివి వసంత్ కుమార్  జ్యోతి ప్రజ్వలన చేశారు. 

 పలువురు వక్తలు భారతీయ సంస్కృతి మరియు గిరిజన సంఘాలు అనే అంశానికి సంభందించిన వివిధ అంశాలను చర్చించారు. ఈ శిబిరంలో  కర్ణాటక సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ బివి వసంత కుమార్, డాక్టర్ రాంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగ హుబ్లీ, డాక్టర్ కవిత కూసుగాల్, డాక్టర్ గిరిజ.వి, డా.గాయత్రీ తదితరులు పాల్గొన్నారు.