పార్వతీపురం మన్యం జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు రాష్ట్రంలో 8వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వాస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీ రావు తెలిపారు. ఈ పరీక్ష రాయుటకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత, ఆదర్శ పాఠశాలలలో 8వ తరగతి చదువుచున్న విద్యార్థులు అర్హులన్నారు. పరీక్ష రుసుము ఓ.సి, బి.సి విద్యార్థులకు రూ.100/-, యస్.సి, ఎస్.టి విద్యార్థులకు రూ.50/- అని తెలిపారు. విద్యార్థులు దరఖాస్తులను ఆన్ లైను లో నుండి స్వీకరించబడును. ఆన్ లైను లో అక్టోబరు 31వ తేదీ లోగా పరీక్ష రుసుము చెల్లించ వచ్చని చెప్పారు. పరీక్ష రుసుమును స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా చలాన ద్వారా మాత్రమే చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరముల కొరకు వెబ్ సైటు www.bse.ap.gov.in లో లేదా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి శుక్ర వారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు తెలిపారు.