నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్.ఎం.ఎం.ఎస్) కు ఎంపికైన విద్యార్ధులు ఈ నెల 31వ తేదీ లోగా ఎన్.ఎస్.పి పోర్టల్ లో నమోదు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి డా.ఎస్.డి.వి.రమణ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఎన్.ఎం.ఎం.ఎస్ కు ఎంపికై ఇప్పటి వరకూ పోర్టల్ లో నమోదు చేయని విద్యార్ధులు 31వ తేదీ లోగా నమోదు చేయుటకు గడువు పెంచారని ఆయన చెప్పారు. ఎన్.ఎస్.పి పోర్టల్ లో నమోదు కాని విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు కాదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్ధులు, సంబందిత ప్రధానోపాధ్యాయులు గమనించి ఎన్.ఎస్.పి పోర్టల్ లో చేయాలని ఆయన కోరారు.