5వ తేదీ వరకు పరీక్ష ఫీజు గడువు పెంపు


Ens Balu
30
Parvathipuram
2022-12-02 11:30:12

2022-23 వ సంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) ఫీజు గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి యస్.డి.వి.రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది 5 తేదీన జరుగనున్న పరీక్షల కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని వివిధ కారణాల వలన పరీక్ష రుసుము చెల్లించని విద్యార్థులకు చివరి అవకాశంగా స్కూల్ లాగిన్ లోని ఎస్ బి ఐ కలెక్ట్ ట్యాబ్ ద్వారా ఈ నెల 5 తేదీలోగా పరీక్ష రుసుము చెల్లించవచ్చన్నారు. ఓ సి, బి సి విద్యార్థులకు రూ.100 లు, ఎస్ సి, ఎస్ టి విద్యార్థులకు రూ.50 లు పరీక్ష రుసుము చెల్లించాలన్నారు. దరఖాస్తు ఫీజు చెల్లించని విద్యార్థులకు హల్ టికెట్ లు జారీ చేయబడవని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.