పాలిటెక్నిక్ లో చేరేందుకు అవగాహన కల్పించాలి


Ens Balu
35
Rampachodavaram
2022-12-13 13:28:43

ఏజెన్సీలోని  వివిధ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి పాస్ అయిన వెంటనే పాలిటెక్నిక్ లో జాయిన్ అయ్యేవిధంగా  విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పాలిటెక్నిక్ టెక్నికల్ విద్య డైరెక్టర్, రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.  మంగళవారం రంపచోడవరం ఐటిడిఎ సమావేశపు హాలులో  అన్ని మండలాలకు సంబంధించిన మండల విద్యాశాఖ అధికారులతో ఆమె 
సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతంలోని ప్రతి ఐటీడీఏ పరిధిలో  2014 సంవత్సరంలో పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు.  మన దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా సాంకేతిక విద్య ఫై యువతి యువకులు సాంకేతిక విద్య కోర్సులు  తీసుకోవాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో కొన్ని కోర్సులు ఏర్పాటు చేయడానికి  ప్రభుత్వం గుర్తించిందన్నారు. 

విద్యార్థులు పదో తరగతి పాస్ అయిన వెంటనే  పోలిసెట్ అప్లై చేసే విధంగా  సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఏజెన్సీలోని  ప్రతి పాఠశాలలో  8వ తరగతి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు  లెక్కలు. ఫిజిక్స్ విద్యపై  దృష్టి పెట్టి విధంగా  ఉపాధ్యాయుల బోధించాలని ఆమె అన్నారు.  గవర్నమెంట్ మోడల్ సాంకేతిక రెసిడెన్షియల్  పాలిటెక్నిక్ కాలేజీలు రాష్ట్రంలో 9 ఉన్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్  భోజన వసతి సౌకర్యం ఏర్పాటు ఇక్కడు వుంటుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో 22 కోర్సులు  ఏర్పాటు చేశామన్నారు.  అదేవిధంగా 18 మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పాలిటెక్నిక్ విద్యపై  ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు  ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వడంతోపాటు రంపచోడవరం లోని  పాలిటెక్నిక్  కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయుటకు  కృషి చేస్తామన్నారు.  

రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే మాట్లాడుతూ ఏజెన్సీలోని  అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులందరికీ సాంకేతిక విద్యపై  ముందుగా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు, ఏజెన్సీలోని చదువుకున్న  యువతి యువకులకు  ప్రైవేట్ సంస్థల్లో  ఉపాధి కల్పించే విధంగా మూడుసార్లు జాబు మేళాలు ఏర్పాటు చేసి.. ప్రైవేట్ సంస్థల్లో ఉపాది కల్పించాలన్నారు. 300 మంది యువతీ యువకులు  ఉపాధి అవకాశాలను  నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా  లబ్ధి పొందుతున్నారన్నారు, పాలిటెక్నిక్   విద్యార్థులకు జాయిన్  అయ్యేందుకు ఏమైనా సమస్యలు ఉన్నాడల  మ దృష్టికి తీసుకురావాలని  సంబంధిత అధికారులకు సూచించారు.   ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్య డిప్యూటీ డైరెక్టర్  డాక్టర్ రామకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సి హె. శ్రీనివాసరావు.  పాలిటెక్నిక్ డెవలప్మెంట్ అధికారి మురళి అసిస్టెంట్ గిరిజన సంక్షేమ శాఖ  అధికారులు హాసిని. రామ తులసి.  మండల విద్యాశాఖ అధికారులు మల్లేశ్వరరావు. తాత అబ్బాయి దొర. ప్రధానోపాధ్యాయులు. సి ఆర్ టి లు తదితరులు పాల్గొన్నారు.