టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులకు
టీటీడీ విద్యాశాఖాధికారి డా.భాస్కర్ రెడ్డి సోమవారం ట్యాబ్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం సంధ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిఇవో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా, డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా 8వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ట్యాబులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. బైజూస్ కంటెంట్ తో కూడిన ఈ ట్యాబ్ ఆఫ్ లైన్ లో కూడా పనిచేసే విధంగా రూపొందించినట్లు చెప్పారు . ట్యాబులను టీటీడీ పరిధిలోని ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు కూడా పంపిణీ చేశామన్నారు.