ఆంధ్రయూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతిగా డా.సి.ఎమ్.వినాయ్ కుమార్ నియమితులయ్యారు. సోమవా రం ఈమేరకు ఏ.యూ ఉపకులపతి ఆచార్య పివిజిడి.ప్రాసద్ రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమెుహన్ నుంచి ఉత్తర్వులు స్వీకరించారు. ఈ సందర్బంగా వినయ్ కుమార్ ని ఉపకులపతి ప్రత్యేకంగా అభినం దించా రు అనంతరం జర్నలిజం విభాగంలో విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు డా.డివిఆర్.మూర్తి అసోసియేట్ ప్రొఫెసర్లు చల్లా రామకృష్ణ, లిల్లీగ్రేస్, విజయ లక్ష్మి , రీసెర్చ్ స్కాలర్ లు, అభినందనలు తెలిపారు.