పీహెచ్డీ, ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఆర్ సెట్ లో సీట్ల కేటాయింపుకు సంబంధించి ఆంధ్రప్ర దేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. PhD కోర్సుల్లోని మొత్తం సీట్లలో 50 శాతం ఏ-కేటగిరీలో, 50 శా తం బీ- కేటగిరీలో కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ జీవో జారీ చేసింది. గత ఏడాది నుండి అన్ని యూనివర్సిటీలకు కలిపి ఉన్నత విద్యామండలి ద్వారా ఏపీఆర్ సెట్ ను నిర్వహించి, అందులో అర్హ సాధించిన వారికే సీట్లు కేటాయిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వలన చాలా మందికి పీహెచ్డీలు సీట్లు, ఎంఫిల్ సీట్లు లభించనున్నాయి.