విభాగాలను పరిశీలించిన రిజిస్ట్రార్ క్రిష్ణమోహన్..
Ens Balu
1
ఆంధ్ర యూనివర్శిటీ
2021-03-18 20:05:15
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పలు విభాగాలను రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ గురువారం ఉదయం పరిశీలించారు. సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమైన నేపధ్యంలో ఆయన విభాగాలను తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఆర్టస్, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.రాజేంద్రకర్మార్కర్‌తో కలసి ప్రత్యక్షంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణ విధానాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణ అధికారులకు పలు సూచనలు చేశారు.