బిలింబి పండు తింటే ఆ రోగాలు పరార్..
Ens Balu
5
Visakhapatnam
2021-02-27 08:24:39
మీకు సుగర్, బీపీ, రుమటాయిడ్ నొప్పులు, చర్మవ్యాధులు, ఫైల్స్, కిడ్నీ సమస్యలు ఉన్నాయా.. ఇక ఆ రోగాల కోసం మరిచిపోండి. ఈ ఒక్కరకం పండు తింటే పైన పేర్కొన్న వ్యాధులన్నీ మటుమాయం అవుతాయ్ అంతేకాదండీ కావాల్సినంత వ్యాధినిరోధక శక్తికూడా పెరుగుతుందట. నిజమేనండి.. మరి ఆ పండు ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, దాని పేరేంటి అనే అనుమానం మీకు రావొచ్చు. ఈ పండుపేరు బిలింబి. ఈ పండు ఎక్కువగా థాయ్ లాండ్, మలేషియా, సౌత్ అమెరికాల్లో పండుతుంది. కానీ ఇపుడు మన భారత దేశంలో కూడా ఈ పండును చాలా మంది పెంచుతున్నారు. ఇది చెట్టు మొదలకు కాసే పండు. ఈ ఒక్క పండు తింటే చాలా రకాల కేన్సర్లు తగ్గడంతోపాటు, చాలా త్వరగా బరువుకూడా తగ్గుతారని చెబుతున్నారు ప్రముఖ వైద్యులు సుధాకొనకళ్ల. ఈ పండు చెట్టు తమ పెరడులోనే పెంచుతున్నామని కూడా వివరిస్తున్నారు. ఈ పండు తింటే చిన్నపిల్లల్లోని గవద బిల్లలు తగ్గించుకోవడాని, బిపీ తగ్గించుకోవడానికి, శరీరం నొప్పులు తగ్గించుకోవడానికి, కాలేయాన్ని శుభ్రపరుచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లీషు మందుల కంటే ఆయుర్వేద వైద్యానికి మంచి డిమాండ్ పెరుగుతుండటంతో చాలా మంది ఆయుర్వేద వైద్యాన్నే బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో డా. సుధ ఈ పండుయొక్క విశిష్టతను వివరించడంతో చాలా మంది వరకూ ఈ విషయం తెలియాలనే ఉద్దేశ్యంతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఈ విషయాన్ని సమస్త పాఠకలోకానికి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఈ పండు ఆన్ లైన్ లో కూడా విరివిగా లభిస్తుంది. అంతేకాదు మీరు ఈ పండును మీ ఇంట్లో పెంచుకోవాలనుకుంటే దీనియొక్క విత్తనాలు కూడా మీకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఎన్నో రోగాలకు దివ్య ఔషదంగా పనిచేసే ఈ బిలింబి పండును తీసుకోడం ద్వారా చాలా మంది ఇబ్బందులు పడుతున్న రోగాలను నయం చేసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.