విజయనగరం జిల్లాలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 250 డి. టైప్ సిలిండర్లు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. ఏ.పి. వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ వద్ద వీటిని భద్రపరచి జిల్లాలోని అవసరమైన ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తామని తెలిపారు. థర్డ్ వేవ్ ని ద్రుష్టిలో పెట్టుకొని అన్ని ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ సిలెండర్లను సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఆక్సిజన్ కొరత లేకుండా, సిలెండర్లు లేవనే మాట రాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.