30న విజయనగరం జిల్లాలో జాబ్ బేళా


Ens Balu
18
Vizianagaram
2022-04-28 14:52:24

విజయనగరం జిల్లాలో నిరుద్యోగ యువత కోసం ఈనెల 30న  జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి డి.అరుణ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఎస్.పి. బంగ్లా సమీపంలోని చైతన్య డిగ్రీ కళాశాల లో జరుగుతుందని పేర్కొన్నారు. బిగ్ బాస్కెట్ సంస్థ, విశాఖలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. వాన్ డెలివరీ ఎక్జిక్యూటివ్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని, అభ్యర్థుల వయస్సు 18-38 సంవత్సరాల మధ్య వుండాలని పేర్కొన్నారు. రూ.12 వేల జీతంతో పాటు, పి. ఎఫ్., ఈ.ఎస్.ఐ. వంటి ప్రయోజనాలు కల్పిస్తారని పేర్కొన్నారు. పికర్స్/స్టాకర్స్ పోస్టుల కోసం అభ్యర్థుల వయస్సు 18-38 సంవత్సరాల మధ్య వుండాలని, రూ.12 వేల జీతంతో పాటు పి.ఎఫ్., ఇ.ఎస్.ఐ. వంటి ప్రయోజనాలు కల్పిస్తారని పేర్కొన్నారు. బైక్ డెలివరీ ఎక్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-40 మధ్య వుండాలని, రూ.12 వేల జీతంతో పాటు పి.ఎఫ్., ఇ.ఎస్.ఐ. తదితర ప్రయోజనాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు విశాఖలో పనిచేయాల్సి వుంటుందని తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ పేర్లను నేషనల్ కెరీర్ సర్వీస్ లాగిన్ (NCS.GOV.IN) లో జాబ్ సీకర్ లాగిన్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంటర్వ్యూ కోసం 30వ తేదీ ఉదయం 10 గంటలకు తమ బయో డేటా, సర్టిఫికేట్ లతో హాజరు కావాలని జిల్లా ఉపాధి అధికారి ఒక ప్రకటనలో కోరారు.