ముగ్గురు పారామెడికల్ సిబ్బంది నియామకం..


Ens Balu
5
Sankhavaram
2020-09-24 12:54:17

శంఖవరం ఆయుష్మాన్ భారత్ వెల్ నెస్ కేంద్రానికి మంజూరైన ముగ్గురు పారామెడికల్ సిబ్బంది విధుల్లోకి చేరారని వైద్యాధికి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. గురువారం ఆయన ఆసుపత్రిలో మీడియాలో మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ ఆసుపత్రికి ఒక ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సులను నియమించిందన్నారు. ఇప్పటి వరకూ సిబ్బంది కొరతతో ఉన్న ఆసుపత్రికి ప్రభుత్వం అందించిన ఈ సిబ్బందితో కాస్త కొరత తీరుతుందని చెప్పారు. అయితే ఈ ఆసుపత్రికి రెండు ల్యాబ్ టెక్నీషియన్లు మంజూరు ఉండగా ప్రస్తుతం ఒక్కరు మాత్రమే వచ్చారన్నారు. ఇద్దరు ఫార్మసిస్టులతో పూర్తిస్థాయిలో మందుల పంపిణీకి వీలుపడుతుందన్నారు. ప్రస్తుతం ల్యాబ్ టెక్నీషియన్ నియామకంతో ఆసుపత్రిలో ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడానికి వీలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు అధికంగా వుండటం వలన ఆ పరీక్షలు మాత్రమే ప్రతినిత్యం చేస్తున్నట్టు చెప్పారు. ఆసుపత్రికి పారామెడికల్ సిబ్బంది మంజూరుకి క్రుషి చేసి ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా డాక్టర్ అభినందనలు తెలియజేశారు.
సిఫార్సు